Hotel Style Idli Chutney : ఇడ్లీల చ‌ట్నీని ఇలా చేస్తే.. హోటల్స్‌లో ల‌భించేలా రుచి వ‌స్తుంది.. ఒక్క ఇడ్లీ ఎక్కువే తింటారు..

Hotel Style Idli Chutney : చాలా మంది అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలు రుచిగా ఉండాలంటే వాటిని తిన‌డానికి చేసే చ‌ట్నీ కూడా రుచిగా ఉండాలి. అప్పుడే ఇడ్లీల‌ను మ‌నం తిన‌గ‌లం. రుచిగా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఇడ్లీ చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ ఇడ్లీ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, పుట్నాల ప‌ప్పు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌,నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, పచ్చిమిర్చి – 6, చింత‌పండు – 2 రెబ్బ‌లు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం – ఒక చిన్న ముక్క‌.

Hotel Style Idli Chutney recipe in telugu method of cooking
Hotel Style Idli Chutney

హోట‌ల్ స్టైల్ ఇడ్లీ చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించుకుని చల్లారే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కొబ్బ‌రి ముక్క‌లు, పుట్నాల ప‌ప్పు, చింత‌పండు రెబ్బ‌లు, కొత్తిమీర‌, ఉప్పు, అల్లం వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గ్లాస్ నీటిని పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న చ‌ట్నీలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హోట‌ల్ స్టైల్ ఇడ్లీ చ‌ట్నీ త‌యార‌వుతుంది. ఈ చ‌ట్నీతో ఇడ్లీల‌ను తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share
D

Recent Posts