vastu

ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలో తెలుసా ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. వాస్తు శాస్త్ర ప్రకారమే ఇంటిలోని గదులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేపట్టడం, అలాగే ఇంటిలో ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఇంటిని నిర్మించుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి ? అనే విషయానికి వస్తే..

ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా ఆరడుగులకు పైనే ఉండాలి. అలాగే కిటికీలు ఇంటి యజమాని నాభి ఎత్తు వరకు ఉండాలి. ఇక ఇంటిలో కిటికీలు, తలుపుల విషయానికి వస్తే ఎల్లప్పుడూ కూడా అవి బేసి సంఖ్యలో ఉండకూడదు. ఎల్లప్పుడూ సరిసంఖ్యలో ఉండాలి. కిటికీలు, కబోర్డ్స్ ఎప్పుడూ కూడా పది ఉండకూడదు. మన ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ కూడితే పక్కన సున్నా వచ్చే విధంగా ఉండకూడదని పండితులు చెబుతున్నారు.

how many doors and windows a house should have

ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటిలోకి ఎక్కువగా గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేయడంవల్ల ఆ ఇంటిలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా సింహద్వారానికి ఎదురుగా పెద్ద వృక్షాలు ఉంటే పుత్ర సంతానానికి నష్టం వస్తుందని చెబుతున్నారు. అలాగే ఒకే కాంపౌండ్ గోడకు మూడు గేట్లు ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts