ఆధ్యాత్మికం

శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించండి.. ఏది కోరుకున్నా నెరవేరుతుంది..!

కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా శనివారం స్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ వారికి కొంగు బంగారంగా నిలిచే స్వామి వారి ఆలయంలో 7 శనివారాలు పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి.

అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా నెరవేరాలంటే 7 శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు.

do pooja to venkateshwara swamy like this to fulfill wishes

ఈ విధంగా 7 శనివారాల వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ప్రీతి చెంది లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తారు. దీంతోనూ అనుకున్నవి నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts