How To Clean Silver Utensils : మన ఇళ్లలో చాలా వరకు వెండి లేదా బంగారంతో చేసిన వస్తువులు, ఆభరణాలు ఉంటాయి. బంగారంతో చేసిన వస్తువులను అయితే రోజూ వాడరు. కానీ వెండితో చేసిన వస్తువులను రోజూ వాడుతారు. ఇక ఆభరణాలను కూడా రోజూ ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే కొన్ని రోజులకు వెండి వస్తువులు నల్లగా మారుతాయి. దీంతో వాటిని మెరిపించడం కోసం అనేక పద్థతులను పాటిస్తుంటారు. అయితే అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. కింద తెలిపిన టిప్స్‌ను పాటిస్తే చాలు, మీ వెండి వస్తువులు లేదా ఆభరణాలు మెరిసిపోతాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఒక గాజు పాత్రకు లోపలి వైపు అల్యూమినియం ఫాయిల్‌ను ఉంచండి. దానిలో మరిగించిన నీటిని పోసి ఆపై లిక్విడ్ డిటర్జెంట్‌ను వేసి కలపండి. వెండి వస్తువులను దానిలో వేసి ఒక నిమిషం వదిలేయాలి. తరువాత బయటకు తీసి గోరు వెచ్చని నీటిలో రుద్ది కడిగితే సరి. లీటర్ వేడి నీటిలో అర చెక్క నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి వాటిలో వెండి పాత్రలు, నగలు ఉంచండి. 5 నిమిషాలు అయ్యాక కాస్త రుద్ది కడిగితే మెరుపు తిరిగొస్తుంది.
గాజు లేదా పింగాణి పాత్రలో అల్యూమినియం ఫాయిల్ మెరిసే వైపుని పైకి వచ్చేలా ఉంచి నీటితో నింపాలి. లీటరు నీటికి 5 స్పూన్ల చొప్పున బేకింగ్ సోడా వేసి మరిగించాలి. దానిలో వెండి వస్తువులను వేసి అర నిమిషం ఉంచి తీయాలి. తరువాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. మరీ మొండిగా పట్టేస్తుంటే రెండోసారి తిరిగి చేయాలి. ఇతర మెటల్ పాత్రలను ఇందుకు వాడద్దు.