Tooth Paste : పేస్ట్‌ను బ‌లంగా వ‌త్తి మ‌రీ పెట్టుకుంటున్నారా.. ఇలా చేస్తే ఆ శ్ర‌మ ఉండ‌దు.. మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Tooth Paste : సాధారణంగా మనం అనేక ర‌కాల టూత్‌పేస్ట్‌ల‌ను వాడుతుంటాం. కొంద‌రు ఎప్పుడూ కొత్త పేస్ట్‌ల‌ను ట్రై చేస్తుంటారు. ఇంకొంద‌రు ఒకే బ్రాండ్‌కు చెందిన పేస్ట్‌ను ఎప్ప‌టికీ వాడుతుంటారు. అయితే పేస్ట్ స‌హ‌జంగానే కొన్ని రోజుల‌కు అయిపోతుంది. దీంతో దాన్ని బాగా వ‌త్తుకుని మ‌రీ పేస్ట్ పెట్టుకుంటుంటారు. ఇక దాని నుంచి పేస్ట్ రాదు అనే దాకా దాన్ని వ‌త్తి మ‌రీ పేస్ట్ పెట్టుకుంటారు. అయితే పేస్ట్ కాస్త ఉన్న‌ప్పుడే కింద చెప్పిన విధంగా చేస్తే దాంట్లో నుంచి పేస్ట్ మొత్తం సుల‌భంగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. దీంతో మ‌ళ్లీ మ‌ళ్లీ దాన్ని వ‌త్తుకోవాల్సిన పని ఉండ‌దు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పేస్ట్ కాస్త ఉంది అనుకున్న‌ప్పుడు ట్యూబ్ కింది భాగం నుంచి మొద‌లు పెట్టి పై వ‌ర‌కు వ‌త్తుతూ వెళ్లాలి. దీంతో ఉన్న ఆ కాస్త పేస్ట్ కూడా పైకి చేరుతుంది. ఇప్పుడు కింద నుంచి మొద‌లు పెట్టి ట్యూబ్ మొద‌లు భాగం వ‌ర‌కు ట్యూబ్‌ను ఉండ‌లా చుడుతూ రావాలి. ట్యూబ్ ను రోల్ చేయాలి. టూత్ పేస్ట్ ఉన్న ద‌గ్గ‌రి వ‌ర‌కు ట్యూబ్‌ను అలా రోల్ చేస్తూ రావాలి. దీంతో చిత్రంలో ఇచ్చిన విధంగా ట్యూబ్ మారుతుంది.

how to get all Tooth Paste from tube if any left over
Tooth Paste

ఇప్పుడు పేస్ట్‌ను పెట్టుకుంటే కింద‌కు వెళ్ల‌దు. ఎందుకంటే కింది భాగం మొత్తాన్ని రోల్ చేసి పైదాకా తెచ్చి అక్క‌డ లాక్ చేశాం. కాబ‌ట్టి పేస్ట్ పెట్టుకుంటే పైనే ప్రెస్ చేస్తారు. దీంతో పేస్ట్ అక్క‌డి నుంచి ట్యూబ్ ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. కానీ ట్యూబ్ కింద‌కు వెళ్ల‌దు. దీంతో ట్యూబ్‌లో ఉన్న పేస్ట్ మొత్తాన్ని సుల‌భంగా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చు. ఇలా చేస్తే పేస్ట్‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ బ‌లంగా వ‌త్తుకుని పెట్టుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. అయిపోగానే వెంట‌నే ఇంకో పేస్ట్‌ను వాడ‌వ‌చ్చు. దీంతో చాలా వ‌ర‌కు శ్ర‌మ త‌ప్పుతుంది. ఇక‌పై పేస్ట్ అయిపోవ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయండి. ఎంతో సుల‌భ‌త‌రం అవుతుంది.

Editor

Recent Posts