food

రుచికరమైన యాపిల్ బర్ఫీ తయారు చేయండిలా

ఎంతో రుచికరమైన యాపిల్ బర్ఫీ తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ యాపిల్ బర్ఫీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన యాపిల్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

యాపిల్స్ 2, జీడిపప్పు పావు కప్పు, పంచదార అర కప్పు, చిక్కటి పాలు మూడు కప్పులు, కొబ్బరి పొడి అర కప్పు, ఏలకుల పొడి అర టీ స్పూన్.

how to make apple burfi recipe in telugu

తయారీ విధానం

ముందుగా జీడిపప్పులను నానబెట్టుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా యాపిల్ పై తోలు తీసి అందులో గింజలు లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసి పెట్టుకోవాలి.తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి చిన్నమంటపై పాలను బాగా కలియబెడుతూ ఉడికించాలి. ఈ విధంగా పాలు బాగా మరుగుతున్న సమయంలో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఆపిల్ గుజ్జు, జీడిపప్పు మిశ్రమం, కొబ్బరి పొడి వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడే సమయంలో ఇందులో చక్కెర పొడి, యాలకల పొడి వేసి కలియబెట్టుకోవాలి. ఈ విధంగా రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ లోకి నెయ్యి పోసి మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనకు ఏవిధంగా నచ్చితే ఆ విధమైన ఆకారంలో కట్ చేసుకొని తినవచ్చు.

Admin

Recent Posts