సాయంత్రం టైం లో ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలి అనిపిస్తుందా.. ఎంతో తొందరగా సులభమైన రుచికరమైన ఎగ్ బన్స్ తయారుచేసుకొని సాయంత్రాన్ని ఎంతో రుచికరంగా ఆస్వాదించండి. మరి ఎగ్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు 5, బ్రెడ్ బన్స్ 5, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కొత్తిమీర తరుగు, కారం పొడి, ఉప్పు, గరం మసాల, చీజ్.
తయారీ విధానం
ముందుగా బన్స్ ఒకవైపు కత్తిరించి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, కారం పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా కత్తిరించి పెట్టుకున్న బన్నులలో వేసి తరువాత వాటిపై కత్తిరించిన బన్ను ముక్కలను పెట్టి ఓవెన్ లో వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్న ఎగ్ బన్స్ పై చీజ్ వేసుకొని వేడివేడిగా తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరెందుకాలస్యం ఎంతో సులభమైన ఈ స్నాక్స్ ఐటెం మీరూ ప్రయత్నించండి.