food

రుచికరమైన.. నోరూరించే కాలా జామున్.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలవు..

చాలా మందికి స్వీట్స్ తినాలంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బయట ఫుడ్ తినాలంటే కాస్త వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఎంతో ఇష్టమైన స్వీట్స్ బయట నుంచి కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు. మరి ఇంట్లో తయారుచేసుకొనే స్వీట్లలో కాలా జామున్ ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

కోవా 400 గ్రా, బొంబాయి రవ్వ టేబుల్ స్పూన్, బాదాం, కాజు ,పిస్తా గుప్పెడు, బేకింగ్ పౌడర్ చిటికెడు, నెయ్యి సరిపడా, చెక్కర -కేజీ, పన్నీర్ 100గ్రాములు, మైదా -అరకప్పు.

how to make kala jamun recipe in telugu

తయారీ విధానం

ముందుగా కాలా జామూన్ తయారు చేయడానికి చక్కెర పాకం తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఒక కిలో పంచదారకు రెండు కప్పుల నీటిని వేసి చక్కెర పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పన్నీరు ఉండలు లేకుండా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులోకి బొంబాయి రవ్వ, చిటికెడు బేకింగ్ సోడా, కోవా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ముంచి రెండు స్పూన్ల మిశ్రమాన్ని పక్కకు తీసుకొని అందులో కొద్దిగా చక్కెర, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్ వేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిగిలిన జామున్ మిశ్రమంతో కొద్దిగా పెద్ద ఉండలు తయారు చేసుకుని అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కలర్ వేసి మనకు నచ్చిన రీతిలో పొడవుగా లేదా గుండ్రంగా తయారుచేసుకొని బాగా మరుగుతున్న నూనెలో వేసి ముదురు ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న జామూన్స్ ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి కరమైన కాల జామున్ తయారైనట్లే.

Admin

Recent Posts