హెల్త్ టిప్స్

వారంలో కనీసం 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే క్యాన్సర్ రాదా?

మన భారతీయ వంటలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి వంటలకు రుచి వాసన ఇవ్వటమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో దాగి ఉండటం వల్ల ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. మరి వెల్లుల్లిని తరచూ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం.

* వెల్లుల్లిలో అధికభాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దాగివున్నాయి. ఇది మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను అణచివేయడంలో దోహదపడతాయి.ఈ క్రమంలోనే వారానికి కనీసం ఐదు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల 50% క్యాన్సర్ కణాలను నశింపజేసి క్యాన్సర్ నుంచి విముక్తిని కల్పిస్తాయి.

can cancer be prevented if you take garlic

*అదేవిధంగా వెల్లుల్లిలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు అధికంగా ఉండటం వల్ల నోటి పూత సమస్యలను నివారించడమే కాకుండా మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది.

*వెల్లుల్లి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను,శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి నొప్పులతో బాధపడేవారు నొప్పి ఉన్న చోట వెల్లుల్లి రసంతో మర్దన చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

*వెల్లుల్లిని ప్రతిరోజు వంటలలో తినడం వల్ల బ్యాక్టీరియా వైరస్ నుంచి వచ్చే అంటూ వ్యాధుల నుంచి మనల్ని రక్షించడానికి దోహదపడుతుంది.

Admin

Recent Posts