Tomato Kaju Masala : ట‌మాటా కాజు మ‌సాలా కూర‌.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Kaju Masala : మ‌న‌కు ధాబాలల్లో ల‌భించే మ‌సాలా క‌ర్రీల‌ల్లో ట‌మాట కాజు మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ట‌మాటాలు, జీడిప‌ప్పు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, నాన్, పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీని అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా, చిక్క‌గా ఉండే ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీని ధాబా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఎండుమిర్చి – 3, జీడిపప్పు – 75 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ట‌మాటాలు – పెద్ద‌వి రెండు, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 3, జీడిప‌ప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – పావు లీట‌ర్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

how to make Tomato Kaju Masala recipe in telugu
Tomato Kaju Masala

ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గానికి పైగా వేగిన త‌రువాత క‌రివేపాకు, ఎండుమిర్చి, జీడిప‌ప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, కారం వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 4 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత నెయ్యి, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ట‌మాట కాజు మసాలా క‌ర్రీని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts