న్యూఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. ఆదివారం ఉదయం ఇది చోటు చేసుకుంది. ఈ సంఘటన CRPF స్కూల్ ఢిల్లీ రోహిణి ఏరియా దగ్గర చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం వలన స్కూల్ గోడ కూలిపోయింది. ఇక ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ప్యారెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే ఒక వ్యక్తి వీడియోని రికార్డు చేశారు. అందులో పొగ వస్తున్నట్లు కనపడింది.
అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటన ఎప్పుడూ చూడలేదని, ఇంత పొగ రావడం చూడడం ఇదే మొదటి సారి అని అన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అక్కడికి వచ్చి పరిశీలించారు. అయితే ఎందుకు ఇలా బ్లాస్ట్ జరిగిందనే దాని వెనుక కారణాలు అయితే తెలియట్లేదు.
ఈ విషయంపై ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. స్కూల్ ఆవరణలో మాత్రం కిటికీలు, తలుపులు, గ్లాసులు వంటివి పగిలిపోయి కాలిపోతున్నట్లు కనపడింది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కారణం ఏంటి అనేది క్లియర్ గా తెలియదు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు.