Idli Pindi Punugulu : మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ప‌డేయ‌కండి.. వాటితో పునుగులు చేస్తే ఎంచ‌క్కా తింటారు..

Idli Pindi Punugulu : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఇడ్లీ పిండి పునుగులు కూడా ఒక‌టి. ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పునుగుల‌ను ఇంట్లో కూడా మ‌నం చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టి సారిగా చేసే వారు కూడా సులభంగా చేసుకునేలా ఇడ్లీ పిండితో రుచిగా పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ పిండి పునుగుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఇడ్లీ పిండి – 2 క‌ప్పులు, మైదా పిండి – ఒక క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, జీలక‌ర్ర – అర టీ స్పూన్, వంట‌సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Idli Pindi Punugulu recipe in telugu make in this method
Idli Pindi Punugulu

ఇడ్లీ పిండి పునుగుల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీట‌ని పోసి పిండిని క‌లుపుకోవాలి. పిండి మ‌రీ పలుచ‌గా క‌లుపుకోకూడ‌దు. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల్లా వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పునుగులు త‌యారువుతాయి. వీటిని ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా పునుగులు వేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts