ఆధ్యాత్మికం

Marriage : వివాహం ఆలస్యం అవుతుందా.. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ చిన్న పని చేస్తే చాలు..!

Marriage : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఈ క్రమంలోనే వివాహం కోసం కొంతమంది ఎన్ని సంబంధాలు వెతికినా పెళ్లి కుదరదు. అయితే ఇలా వివాహం ఆలస్యం కావడానికి కారణం జాతక దోషాలు అని పండితులు చెబుతుంటారు. ఇలా జాతక దోషాలు ఉన్న వారు పూజలు చేసినా, పరిహారాలు చేసినా కొన్ని సార్లు వివాహం ఆలస్యమవుతుంది. అయితే ఇలా వివాహం ఆలస్యం అయ్యేవారు పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం చేస్తే వివాహ ఘడియలు దగ్గరపడతాయని పండితులు చెబుతున్నారు.

పెళ్లి ఆలస్యమవుతున్న అమ్మాయిలు ప్రతి రోజూ ఉదయం నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి. అనంతరం 108 పసుపు కొమ్ములతో కాళీ పస్యవ్య వదనం భర్తహుః శశిధర ప్రభమం సమదృష్టిః భూత్వా కురిశ్వాగ్ని ప్రదక్షిణం.. అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి అర్చన చేయడం వల్ల వివాహ దోషం తొలగిపోతుందని, తొందరగా వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ఇలా అర్చన తర్వాత అరటి చెట్టు కింద దీపం వెలిగించి పూజించాలి.

if marriage is getting delayed then do like this

వివాహం ఆలస్యమవుతున్న అబ్బాయిలు కూడా ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి. అలాగే సూర్య నమస్కారం చేసుకున్న అనంతరం ఇంట్లో దేవుని గదిలోనూ లేదా ఏదైనా ఆలయానికి వెళ్లి ఓం కామేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇలా చేయడం వల్ల వివాహ దోషాలు తొలగిపోయి తొందరగా పెళ్లి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts