ఎలుకలు ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అవి మీ కళ్ళముందరి నుంచే చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఎంత చిరాకుగా ఉంటుంది. పల్లెల్లో ఎలుకల సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు ఎలుకల బోన్లు పెట్టి మరీ వాటిని బంధిస్తుంటారు. మరికొందరు వివిధ రకాల మందులు పెట్టి.. ఎలుకలను చంపేస్తుంటారు. ఎలుకల్ని బయటకు పంపకపోతే… అన్నీ కొరికి చిందర వందర చేయడమే కాదు… అడ్డమైన ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చేలా చేయగలవు. ఎలుకల్ని తరిమేందుకు మార్కెట్‌లో రకరకాల స్ప్రేలు, పెస్టిసైడ్స్ ఉన్నాయి. అవి వాడితే… వాటిలోని కెమికల్స్ మనకు హాని చేస్తాయి.
అందుకే మీ ఇంట్లో ఎలుక పదే పదే కనిపిస్తే, వినాయకుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. వాస్తవానికి, ఎలుకల సంఖ్య పెరుగుదల ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. వాటిహాని కలిగించడం లేదా తరిమికొట్టడం వంటివి చేయకూడదు. గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎలుకలు ప్రశాంతంగా వెళ్లిపోతాయి. మీరు ఎలుకలను ఎక్కడ చూసినా నీటి గిన్నె ఉంచండి. ఇది బట్టలు లేదా గృహోపకరణాలను కొరకకుండా నిరోధించవచ్చు. ఎలుకల బెడదను నివారించడానికి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
మీ ఇంటి బయట ఎలుకల రంధ్రాల దగ్గర కొన్ని ధాన్యాలు లేదా ఆహారాన్ని ఉంచడం చేయండి. ఎలుకల ఉనికి మీ ఇంటికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తే, అది రాబోయే ఆర్థిక ఇబ్బందులకు సంకేతం కావచ్చు. మరోవైపు ఎలుకలు మనని వేధిస్తుంటే.. లవంగాలతో వాటికి చెక్ పెట్టవచ్చు.లవంగాలు మనకు సువాసన ఇచ్చినట్లు అనిపిస్తాయి… అదే ఎలుకలకు కడుపులో తిప్పుతుంది. అసలు లవంగాల్ని చూస్తే చాలు… ఎలుకలకు పిచ్చి కోపం వస్తుంది. తమకు బద్ధ శత్రువుల్లా ఫీలవుతాయి. ఎలుకలు వెళ్లే కన్నాల దగ్గర… చిన్నచిన్న గుడ్డల్లో కొద్దిగా లవంగాల్ని ఉంచండి. అంతే… ఎలుకలు ఇక ఈ ఇంట్లో ఉండటం మన వల్ల కాదు… పోదాం పదండి అంటూ బయటకు పోతాయి.