Aadhar Card : హోట‌ల్‌లో ఆధార్ కార్డ్ ఇస్తున్నారా.. ఇలా చేయ‌కపోతే త‌ప్ప‌క మోస‌పోతారు..!

Aadhar Card : ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్ అనుసంధానం చేయ‌డం మ‌నం చూస్తున్నాం. ఆధార్ ద్వారా ఆ వ్య‌క్తి పూర్తి వివ‌రాలు తెలుసుకోగ‌లుగుతున్నారు. అయితే మ‌నం హోట‌ల్స్‌కి వెళ్లిన‌ప్పుడు కూడా ఆధార్ కార్డ్ త‌ప్ప‌ని స‌రిగా అడ‌గ‌డం మ‌నం చూస్తున్నాం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఓయో రూముల్లో చాలా మంది ఆధార్ కార్డు ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని, అందులోని డేటాను దొంగిలించే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బుకింగ్ టైంలో మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించాలని సూచిస్తున్నారు.ఆధార్ కార్డ్ లాగా, మాస్క్డ్ ఆధార్ కార్డ్ కూడా ఇప్పుడు ముఖ్య‌మైన ప‌త్రంగా చెబుతున్నారు.

ప్ర‌తి ఐడీ ప్రూఫ్‌లో భాగంగా దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. మాస్క్‌ వేసిన ఆధార్ కార్డ్‌లో ఆధార్ నంబర్‌లోని మొదటి 8 నంబర్‌లు దాచి ఉంటాయి. అంటే ప్రజలు చివరి 4 అంకెలను మాత్రమే కనిపించ‌డం జ‌రుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీ నంబర్‌ను దాచడం ద్వారా, మీ వివరాలన్నీ సురక్షితంగా ఉంటాయి. దీని తర్వాత ఎవరూ మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను దుర్వినియోగం చేసే అవ‌కాశం ఉండ‌దు. మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది మీ ఆధార్ కార్డ్ వెర్షన్. ప్రయాణంలో మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఏదైనా హోటల్‌లో బుకింగ్ చేసేటప్పుడు లేదా చెక్ అవుట్ చేస్తున్నప్పుడు ధృవీకరణ సమయంలో దీనిని ఉపయోగించే అవ‌కాశం ఉంటుంది. విమానాశ్రయంలో కూడా మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.

if you are giving aadhar card in hotel then must follow this
Aadhar Card

మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..? UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి మీరు మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 1. ముందుగా మీరు UIDAI అధికారిక పోర్టల్ https:uidai.gov.inలోకి ఎంటర్ అవ్వాలి. 2. దీని తర్వాత మీరు My Aadhaar ఆప్షన్‌కు వెళ్లాలి. 3. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్‌ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. 4. దీని తర్వాత మీరు సెండ్ OTP ఆప్షన్‌‌ సెలక్ట్ చేయాలి. 5. తర్వాత ఆధార్‌తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. 6. అప్పుడు మీరు డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవ‌చ్చు 7. దీని తర్వాత మీరు చెక్‌బాక్స్‌లో డౌన్‌లోడ్ మాస్క్డ్ ఆధార్‌ను టిక్ చేయాలి. 8. మీరు చెక్‌బాక్స్‌ను టిక్ చేసి సబ్‌మిట్ ఆప్షన్‌పై నొక్కండి. 9. దీని తర్వాత ముసుగు వేసిన ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక దీని పాస్‌వర్డ్ కోసం మీరు మీ పేరులోని నాలుగు అక్షరాలు, మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

Sam

Recent Posts