ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే సులభంగా గుర్తుపట్టొచ్చు. ఫీల్డ్ స్పాట్: పుచ్చకాయ పై భాగంలో తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటుంది. అది ఆ పుచ్చకాయ నేలమీద ఆని వుండడం వల్ల వచ్చింది. ఆ మచ్చ తెల్లగా వుంటే తీసుకోకండి అది ఇంకా పచ్చిగా వుందని అర్దం. ఎంత పసుపుగా వుంటే అంతా బాగా తయారైందని లేదా మగ్గి వుంటుందని అర్ధం. సౌండ్ టెస్ట్: పుచ్చకాయని తట్టినప్పుడు గుల్ల సౌండ్ రాకూడదు. అలా వస్తే అది ఇంకా తయారవ్వలేదని అర్ధం.
పుచ్చకాయ మీద చారలు: పెద్దగా సమంగా కనిపించే డార్క్ గ్రీన్ లైన్స్ ఉంటే అది మంచి పుచ్చకాయకి సంకేతం. పుచ్చకాయ కాడ లేదా తొడెం: ఆ తొడెం బాగా ఎండిపోయి వుండాలి, అలా వుంటే ఆ కాయ తయారైందని అర్దం. పచ్చిగా వుంటే ఇంకా ఆ కాయ తయారవ్వలేదని అర్దం. బరువు: తక్కువ బరువు కన్నా ఎక్కువ బరువు వున్న పుచ్చకాయలు ఎక్కువ తీపి వుంటాయని కొందరి అభిప్రాయం. పెద్దగా వున్న పుచ్చకాయల బాగా తయారయ్యి ఎక్కువు నీటి శాతం కలిగి వుంటాయని సంకేతం.
ఆకారం: గుండ్రంగా ఉండే కాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి. అడ్డంగా ఉన్నవి కొద్దిగా తక్కువ తీపిగా ఉండే అవకాశముంది. మోసపోవద్దు! ఈ పొరపాట్లు చేయకండి. తక్కువ ధర చూసి కొనకండి. కుదిరితే ఒక ముక్క కోసి చూపించమనండి. కొంచెం పగులున్నా ఆ కాయలని కొనకండి.