మన నిత్యజీవితంలో ప్రతిరోజూ మనకు శక్తినందించే పళ్ళను తింటుంటాం. ఫ్రూట్స్ లో అతి తక్కువకే దొరికే పళ్ళంటే ముందుగా గుర్తుకువచ్చేవి అరటిపళ్ళు. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా తీసుకువచ్చే వస్తువు అరటిపండు. ఎన్నో విధాలుగా వంటల రూపంలో, చిప్స్, జ్యూస్.. ఇలా ప్రతిఒక్క వాటిల్లో అరటిపండును ఉపయోగించుకోవచ్చు. అరటిపళ్ళలో చాలా రకాలున్నాయి. పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు,అమృతపాణి, కర్పూరం. అయితే మనం తీసుకునే అరటిపళ్ళలో ఎక్కువగా పచ్చ అరటిపళ్ళనే తీసుకోవడానికి ఇష్టపడతాము. దానివల్ల కలిగే ప్రయోజనాలేవో మీరే చూడండి.
మనం రోజూ ఎన్నో పనులతో సతమతవుతుంటాం. అలాంటి సమయంలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటాం. ఆ ఒత్తిడిని బయటపడేందుకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఎనర్జీని ఇచ్చే పండు అరటిపండు. ఎక్కువ ఆకలితో వున్నప్పుడు కేవలం రెండే రెండు అరటిపళ్ళు తింటే చాలు ఆకలిని కొన్ని గంటలవరకు తట్టుకోగలిగే సామర్థ్యం ఎక్కువగా వస్తుంది. జిమ్ లో వర్కౌట్ చేసే సమయంలో వర్కౌట్ ముందు, తర్వాత రెండు అరటిపళ్ళను తినమని నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల రక్తపోటు పెరగకుండా నిరోధిస్తుంది. అలాగే మజిల్ పెరగడంలోనూ దోహదం చేస్తుంది. ఆఫీసులో బాస్ చెప్పిన టార్గెట్స్, ట్రాఫిక్ తో చికాకు, ఇలా ప్రతి ఒక్కదానికి చిరాకు పడుతూ మెంటల్ ప్రెజర్ కు లోనవుతుంటాం.
మన మనసులో ఉన్న చెత్త ఆలోచనలు, టెన్షన్స్ ని దూరం అయ్యేలా చేస్తుంది. ఇందులో వుండే ట్రిఫ్టోటాన్, సెరోటోనిన్ లా మారి బ్రెయిన్ ను వేగవంతంగా పనిచేసేలా చేయడమే కాకుండా సంతోషకరంగా ఉండేలా మన ఆలోచనలో మార్పుతెస్తుంది. దీన్ని తీసుకోవడం షుగర్ పేషెంట్స్, గర్భిణులు ఒత్తిడి నుండి దూరమై ఆనందంగా ఉంటారు. ఇందులో పిండిపదార్థాలు, మాంసకృత్తులు ఉండటం వలన సులభంగా జీర్ణమై, మలబద్దకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను అరికడుతుంది. విరేచనాలను, మలబద్ధకాన్ని, అల్సర్ ను ఈ పచ్చ అరటిపండు అరికడుతుంది.
వైద్యులు ప్రతిరోజూ వీలైతే ఒక అరటిపండు లేదా ఆపిల్ తినమని చెబుతారు. ఆపిల్ ధర ఎక్కువ కాబట్టి మన బడ్జెట్ కు తగ్గట్లుగా అరటిపండును తీసుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు. అందాన్ని పెంచే లక్షణాలు ఈ అరటిపండులో ఉన్నాయి. మన శరీరంలో పేరుకుపోయిన ట్యాకసిన్ ను ఇది తొలగిస్తుంది. కేవలం ఒత్తిడి, హార్ట్ ఎటాక్ వరకే కాకుండా అందాన్ని పెంచేలా చేస్తుంది. ఇందులో వుండే పీచుపదార్థాన్ని మర్దనా చేసుకోవడానికి ఉపయోగిస్తారు, ఉదయాన్నే ఒక అరటిపండు తీసుకోవడం వల్ల ఎనర్జీ పెరిగి, ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక అరటిపండు తీసుకోవడం వలన నిద్రలేమి, జీర్ణవ్యవస్థ బాగా జరగడం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఎక్కువగా ఐరన్ వుంటుంది కాబట్టి హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.
కామెర్ల విధి ఉన్న రోగులు, బిపి ఉన్న వారు ఈ అరటిపళ్ళను తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంటాసిడ్ గా ఈ అరటిపళ్ళు పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. లెక్టిన్ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది. ఎన్నో రకాలుగా మేలు చేస్తున్న ఈ అరటిపండు గురించి అపోహలు పక్కన పెట్టి మీరూ ఈరోజు నుండే కనీసం ఒక అరటిపండైనా తిని ఆరోగ్యవంతంగా, సంతోషంగా జీవించండి.