technology

మీ ఫోన్ పోయిందా..? అయితే గంటలోగా ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా స్మార్ట్ ఫోన్ పై ఆధారపడిపోయారు. ఫోన్ ద్వారా కేవలం వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇలా అనేక వాటి కోసం ఫోన్లను ఈజీగా ఉపయోగిస్తున్నాము. అయితే, మొబైల్ ఫోన్ పోయిందంటే మాత్రం పెద్ద సమస్యే. అయితే స్మార్ట్ ఫోన్ కనుక పోయిందంటే గంటలోగా ఇలా చేయండి. అప్పుడు సురక్షితంగా మీ ఫోన్ ఉంటుంది. మీ ఫోన్ పోయిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే ఫోన్ వాళ్ళు వెతికి పట్టుకుంటారు. భవిష్యత్తులో ఏమైనా లీగల్ సమస్యలు ఎదురైనా కూడా హెల్ప్ అవుతుంది.

అలాగే ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డ్ ని బ్లాక్ చేయాలి. సిమ్ కార్డ్ ని బ్లాక్ చేయడానికి మొబైల్ ఆపరేటర్ కి కాల్ చేసి బ్లాక్ చేయమని చెప్పొచ్చు. అలాగే ఫోన్ లో ఉండే డేటా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఐఫోన్ లేదా గూగుల్ ఫైండ్ మై డివైజ్ లోకి వెళ్లి మీరు సులువుగా ఫోన్ ని లాక్ చేయొచ్చు. లేదంటే డేటా ని డిలీట్ చేయొచ్చు.

if you lost your phone then do these 5 things immediately

అలాగే బ్యాంకు సర్వీసులని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు. టెంపరరీగా మీ బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేసుకోవడం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను కూడా బ్లాక్ చేసుకోవడం వంటివి చేయొచ్చు. దీంతో మీ ఖాతా ఖాళీ అయిపోకుండా ఉంటుంది. మీ డబ్బులుకి ఎలాంటి నష్టం కలగదు. ముఖ్యమైన ఫోటోలని, వీడియోలని మీరు బ్యాకప్ చేయండి ఒకవేళ మీ ఫోన్ పోయిందంటే మీరు డేటాని బ్యాకప్ చేయొచ్చు. దాంతో మీ ఫోన్లో ఉండే ఫోటోలు వంటి వాటికి ఎలాంటి ప్రమాదం కలగదు.

Peddinti Sravya

Recent Posts