Ileana : సోషల్ మీడియాలో ఇలియానా ఈ మధ్య చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన స్టన్నింగ్ లుక్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. తన ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లు దాటినందుకు గాను కొన్ని అద్భుతమైన ఫొటోలను దిగి వాటిని పోస్ట్ చేసింది. వాటిల్లో ఇలియానా అందాలను ఆరబోసింది. పర్పుల్ కలర్ బికినీలో ఇలియానా ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి.
తాను ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించానని.. అందుకు కృతజ్ఞతగా ఈ ఫొటోలను షేర్ చేస్తున్నానని.. ఇలియానా తెలియజేసింది.
ఇక ఇలియానా చివరిసారిగా 2021లో ది బిగ్ బుల్ అనే మూవీలో నటించింది. అందులో అభిషేక్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. త్వరలో ఈమె అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ అనే సినిమాలో రణ్‌దీప్ హుడా పక్కన కనిపించనుంది. దీంతోపాటు విద్యాబాలన్, ప్రతీక్ గాంధీలతో కలిసి మరో కామెడీ డ్రామా మూవీలోనూ ఇలియానా కనిపించనుంది.