Curry Leaves : కరివేపాకులను రోజూ మనం ఉపయోగిస్తుంటాం. వీటిని కూరల్లో వేస్తుంటారు. కరివేపాకులను కూరల్లోంచి తీసేసి తింటారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ కరివేపాకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అనేక వ్యాధులను తగ్గించేందుకు ఇవి అమోఘంగా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక 10 కరివేపాకులను అలాగే నమిలి తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కరివేపాకులను పరగడుపునే తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కరివేపాకులను తిన్న తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. కరివేపాకుల్లో ఉండే విటమిన్ సి, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్‌లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు రాలే సమస్య ఉన్నవారు రోజూ వీటిని పరగడుపునే తింటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది.
2. కరివేపాకులను పరగడుపునే తినడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తినే ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
3. ఉదయం నిద్ర లేవగానే వికారంగా అనిపించడం, వాంతులు కావడం వంటి సమస్యలు ఉన్నవారు కరివేపాకులను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
4. కరివేపాకులను పరగడుపునే తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గాలనుకునేవారికి కరివేపాకులు ఎంతగానో మేలు చేస్తాయి.
5. కరివేపాకులను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. దృష్టి లోపం, కంటి సమస్యలు తగ్గుతాయి. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.