information

రెంట‌ల్ అగ్రిమెంట్ త‌యారీలో ఈ 10 అంశాలు త‌ప్పక ఉండేలా చూసుకోండి..!

ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవ‌డం అనేది ఆషామాషీ కాదు. అందుకే చాలా మంది రెంటెడ్ హౌజ్‌లో ఉంటున్నారు.పట్టణాల్లో సగానికిపైగా రెంట్‌కి ఉంటారని చెప్పొచ్చు. నగరాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటుంటారు. చాలా మంది యజమానులు ఇదే అదునుగా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపి గదుల్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెకుండేవారు ఉన్నప్పటికీ.. పట్టణాల్లోనే ఇది మరీ ఎక్కువ అని చెప్పొచ్చు. అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో కొన్ని విషయాలు తప్పకుండా ప్రస్తావించాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. రెంటల్ అగ్రిమెంట్‌లో సాధారణంగా అద్దె ఎంత, ఎప్పుడు ఇవ్వాలి, అగ్రిమెంట్ సమయం అనేది చాలా కీలకంగా ఉంటుంది.

చిన్న చిన్న ఊర్లలో రెంటల్ అగ్రిమెంట్ లేకుండానే ఇళ్లు అద్దెకు ఇస్తుండ‌డం, తీసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ ప‌ద్ద‌తి మంచిది కాదు. ఇరువురి మధ్య రెంటల్ అగ్రిమెంట్ తప్పకుండా ఉండాలి. రెంట‌ల్ అగ్రిమెంట్‌లో సంతకం చేసేముందు ఈ వివరాలు ఉన్నాయో లేవే ఓ సారి చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఏయే వివరాలు ఉన్నాయి ఏవి లేవనేది చూసుకోవాలి. అంటే ఉదాహరణకు మెయింటెనెన్స్ అందులో కలిపి ఉంటుందా లేక విడిగా ఉంటుందా అనేది అక్కడ వివరించాలి. ఇళ్లు అద్దెకు తీసుకునేముందు ఆ ఇంట్లో సామగ్రి ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా ఉండాలి. పార్కింగ్ ఛార్జి, విద్యుత్ ఛార్జి వంటి వివరాలు తప్పకుండా ఉండాలి. సాధారణంగా చాలామంది వీటిని తేలిగ్గా తీసుకుని వదిలేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.

important points when making rental agreement

అన్నింటికంటే ముఖ్యంగా అగ్రిమెంట్ ఎంత కాలం వర్తిస్తుందనేది ఉండాలి. ఒకవేళ అగ్రిమెంట్ 3-4 ఏళ్లకు రాసుకుంటే ఏడాదికి ఎంత పర్సంటేజ్ పెంచుతారనేది కూడా అందులో ప్రస్తావించాలి. ఒకవేళ అద్దెదారుడు లేదా ఇంటి ఓనర్ ఆ ఒప్పందాన్ని నిర్దేశిత సమయం కంటే ముందే బ్రేక్ చేయాలనుకుంటే నోటీస్ పీరియడ్ ఎంత అనేది ఉండాలి. ఒక నెల లేదా రెండు నెలల నోటీస్ పీరియడ్ ఇరువురికీ వర్తిస్తుంది. ఆ వివరాలు అగ్రిమెంట్‌లో త‌ప్ప‌క‌ ప్రస్తావించాలి. కొంతమంది ఇంటి ఓనర్లు పెట్ యానిమల్స్ లేదా బర్డ్స్ అనుమతించరు. కొంతమంది పార్కింగ్ లేదంటారు. ఇది ఎవరిష్టం వారిదే అయినా ఆ వివరాలు అగ్రిమెంట్‌లో తప్పకుండా ఉండాలి.అద్దెదారు.. సమయానికి రెంట్ కట్టడంలో విఫలమైతే.. మొదట అతడితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి. అది కుదరనప్పుడు.. అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు కూడా పంపొచ్చు. ఇది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుంది.

Sam

Recent Posts