ఆధ్యాత్మికం

Pooja Room : ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి.. ఎలా ఉండాలి.. ఈ పొరపాట్లు చేయవద్దు..!

Pooja Room : ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా దేవుడి చిత్రపటాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది. అయితే పూజగదిని, దేవుడి ప్రతిమలను ఆర్థిక స్థోమతని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చోటుని బట్టి కూడా పెట్టుకుంటూ ఉంటారు. దేవుడికి ప్రత్యేకించి కొందరు ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది.

ఈశాన్యం వైపు ఆ గదిలో ఎత్తుగా అరుగు కానీ మందిరంలాగా కానీ కట్టుకుని నిర్మించకూడదు. దేవుడి పటాలని ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ, నైరుతి దిక్కులలో పీట వేసి కానీ లేదంటే వస్త్రంపై కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ దేవుడి చిత్ర పటాలని మీరు వేలాడ తీయాలి అనుకుంటే, ఈశాన్యం గదిలో దక్షిణం, పశ్చిమం వైపు పెట్టుకోవచ్చు. ఒకవేళ దేవుడి గదిని ఈశాన్యం వైపు మీరు పెట్టుకోలేకపోతే, తూర్పు వైపు పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయువ్యాలలో కూడా పెట్టుకోవచ్చు.

in which direction pooja room should be in home

నైరుతి, ఆగ్నేయ గదుల్ని మాత్రం దేవుడి గదులుగా పెట్టుకోకండి. దేవుడి గదిని ఏర్పాటు చేసుకోలేకపోతే ఇక ఏ గదిలో అయినా సరే అల్మారాలో కానీ పీట మీద కానీ దేవుడి పటాలని, ప్రతిమలని పెట్టుకుని పూజించవచ్చు. దేవుళ్ళని పెట్టేటప్పుడు తూర్పు, ఉత్తరాలకి ఉండాలి. ధ్యానం చేసే వాళ్ళు, తూర్పు వైపు అభిముఖంగా ఉండి, ధ్యానం చేస్తే మంచిది.

పూజగదికి ఎటువైపు కూడా ఆనుకుని బాత్‌రూమ్‌ ఉండకూడదు. అలాగే పూజగది పైన కానీ కింద కానీ టాయిలెట్స్ కూడా ఉండకూడదు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్లు కూడా కచ్చితంగా చూసుకోవడం మంచిది. అలాగే పూజ చేసేటప్పుడు వట్టి నేల మీద కూర్చుని పూజ చేయకూడదు. చాప కానీ ఏదైనా వస్త్రాన్ని కానీ వేసుకొని పూజ చేయాలి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వీటిని పాటించడం మంచిది.

Admin

Recent Posts