vastu

TV Fridge And Sofa : ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, సోఫాల‌ను అస‌లు ఏ దిక్కున పెట్టాలి..?

TV Fridge And Sofa : వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే కల‌సి వస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అలాగే మనం ఇంట్లో ఎన్నో సామాన్లు పెడుతూ ఉంటాము. వాటిని కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటేనే మంచిది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని నియమాలని తెలియ‌జేస్తున్నారు. వాటిని తెలుసుకొని ఆచరించినట్లయితే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది. ఏ సమస్యలు రావు. ఆనందంగా ఉండొచ్చు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, సోఫా వంటివి ఏ దిశలో పెట్టుకుంటే కలిసి వస్తుంది..?, ఏ దిశలో వాటిని పెట్టుకోవాలి.. అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సోఫాని దక్షిణం వైపు కానీ పశ్చిమ దిశలో కానీ పెట్టుకోవడం మంచిది. ఇది ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సుని తీసుకువస్తుంది. ఇలా ఈ దిశలో మీరు సోఫాని పెట్టడం వలన పేదరికం కూడా ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.

in which direction we have to put tv and fridge

ఇక టీవీ విషయానికి వస్తే టీవీని ఇంటి తూర్పు గోడకి పెట్టాలి. టీవీని తూర్పు దిశలో పెట్టుకుని చూడడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ ని ఈశాన్యం వైపు మాత్రం పెట్టకూడదు. అలాగే ఇంటి గోడలకి, మూలలకి కనీసం ఒక అడుగు దూరం ఉంచిపెట్టుకోవచ్చు.

ఫ్రిడ్జ్ ని ఉత్తరం లేదా పశ్చిమ వైపు పెట్టుకుంటే మంచిది. ఇలా అయితే కలిసి వస్తుంది. సమస్యలేమీ రావు. సంతోషంగా ఉండొచ్చు. మైక్రోవేవ్, స్టవ్ వంటివి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టకండి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాలి. ఫ్రిడ్జ్ ని ఈశాన్యం వైపు లేదంటే నైరుతి మూలలో అసలు పెట్టకండి. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. సంతోషంగా ఉండొచ్చు.

Admin

Recent Posts