ఆధ్యాత్మికం

కలలో వివిధ రకాల జంతువులు కనిపిస్తున్నాయా.. దాని ఫలితాలు ఇవి..

సాధారణంగా కలలు రావడం సర్వ సాధారణంగా జరిగే అంశం. ఈ విధంగా కొందరికి అందమైన కలలు వస్తే మరి కొందరికి భయంకరమైన కలలు వస్తాయి. ఈ క్రమంలోనే కొందరికి కలలో జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని రకాల జంతువులు కలలో కనిపించడానికి కూడా ఒక కారణం ఉందని పెద్ద వారు చెబుతుంటారు. అయితే జంతువులు మన కలలో కనిపించే విధానం బట్టి నా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మరి జంతువు ఏవిధంగా కనిపిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

కుక్కలు మన కలలో కనిపిస్తే మనం మన శత్రువు పై విజయం సాధిస్తున్నామని సంకేతం. ప్రాణ స్నేహితుడు కూడా దూరమవుతారని దీని అర్థం.మన కలలో తెల్ల పిల్లి కనిపిస్తే కష్టాలు రాబోతున్నాయని, నల్లపిల్లి కనిపిస్తే మానసిక సామర్థ్యాలు ఉపయోగించడానికి వెనక అడుగు వేస్తున్నారని అర్థం.

if you are dreaming about these then these are the results

కొందరికి ఒంటె కలలో కనిపిస్తే ఎంతో పెద్ద సమస్యలను మీ భుజాలపై పడబోతోందని అర్థం. అదేవిధంగా కలలో కొందరికి గుర్రాలు కనిపిస్తాయి. మరి నల్లటి గుర్రం కనిపిస్తే మీపై క్షుద్రపూజలు చేపడ్డాయని సంకేతం. అదేవిధంగా తెల్లటి గుర్రం కనబడితే మీకు జీవితంలో అదృష్టం రాబోతుందని అర్థం. కొంతవరకు ఏనుగు కలలో కనిపిస్తాయి కలలోకి రావడం శుభ సంకేతం. ఏనుగు లక్ష్మీదేవి పక్కనే ఉండటం వల్ల ఏనుగు మన కలలోకి వస్తే అనుకోని సంపద మనకు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఆవు కలలో కనిపిస్తే దేవతలందరి ఆశీర్వాదం మనపై ఉంటుందని అర్థం.

Admin

Recent Posts