food

Faluda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఫ‌లూదా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Faluda : చాలా మంది చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. చాలా మంది చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. వాటిల్లో ఫ‌లూదా కూడా ఒక‌టి. బ‌య‌ట మ‌న‌కు బండ్ల‌పై ఇది ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు.. బ‌య‌ట బండ్ల‌పై ఇచ్చేలాంటి రుచితో ఫ‌లూదాను ఇంట్లోనే మ‌నం ఎంతో ఈజీగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక ఇందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ‌లూదా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పాలు – 2 క‌ప్పులు, స్ట్రాబెర్రీ జామ్ – అర క‌ప్పు, రోజ్ సిర‌ప్ లేదా రూ అఫ్జా – 3 టేబుల్ స్పూన్లు, నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌లు, ఉడికించిన సేమ్యా – 1/3 క‌ప్పు, పిస్తా, బాదం పప్పు తురుము – 2 టీస్పూన్ల చొప్పున‌, వెనిల్లా ఐస్ క్రీమ్ – 4 టీస్పూన్లు, చ‌క్కెర – రుచికి స‌రిప‌డా.

faluda recipe very easy to make

ఫ‌లూదాను త‌యారు చేసే విధానం..

ఫ‌లూదా త‌యారీకి 2 గంట‌ల ముందుగా జామ్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ఉంచుకోవాలి. త‌రువాత పాల‌ను స్ట‌వ్ మీద పెట్టి ఒక‌టిన్న‌ర క‌ప్పు అయ్యే వ‌ర‌కు మ‌రిగించి చ‌ల్లార్చాలి. ఆ త‌రువాత చ‌క్కెర‌, 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిర‌ప్ లేదా రూఅఫ్జా క‌లిపి పాల‌ను బాగా గిల‌కొట్టి ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ త‌రువాత గ్లాసులు తీసుకుని మొద‌ట రోజ్ సిర‌ప్ లేదా రూఅఫ్జా వేసి ఆపైన జామ్‌ను కొద్దిగా చిదిమి వెయ్యాలి. ఆ త‌రువాత సేమ్యా, స‌బ్జా గింజ‌లు వేసి గ్లాసుల్లో మూడొంతుల వ‌ర‌కు పాలు పోయాలి. చివ‌ర‌గా పైన ఐస్‌క్రీమ్‌, పిస్తాం, బాదం తురుము వేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన ఫ‌లూదా రెడీ అవుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు.

Admin

Recent Posts