IPL 2022 : ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ట్రోఫీలను సాధించిన టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. ఆ తరువాత చెన్నై ఆ జాబితాలో ఉంది. అయితే ముంబైని సక్సెస్ బాట పట్టించిన ఘనత కెప్టెన్ రోహిత్ శర్మకే దక్కుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాలని ముంబై ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. అందుకు కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఈ క్రమంలోనే జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి.
ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ అనంతరం తమ ముంబై జట్టుతో చేరాడు. అవసరమైనన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాక రోహిత్ జట్టుతో కలిసి తాజాగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో రోహిత్ చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. ఓ దశలో ధోనీ ఆడే హెలికాప్టర్ షాట్‌ను రోహిత్ నెట్స్‌లోనే బాదాడు. దీంతో ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది.
కాగా రోహిత్‌శర్మ ఐపీఎల్ 2020లో 332 పరుగులు చేయగా.. 2021 సీజన్‌లో 381 పరుగులు చేశాడు. ఇక ముంబై తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 27వ తేదీన ఢిల్లీతో ఆడనుంది. దీంతో ఆ మ్యాచ్ కోసం ముంబై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.