Mutton : వారెవ్వా.. నోరూరించే దమ్‌ కా మటన్‌ను.. ఇలా తయారు చేసుకోండి..!

Mutton : మటన్‌తో అనేక రకాల వెరైటీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. చాలా మంది మటన్‌తో కూర లేదా బిర్యానీ వంటివి వండుకుని తింటుంటారు. అయితే మటన్‌తో ఇంకా అనేక వెరైటీలను తయారు చేసుకుని తినవచ్చు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోనే అలాంటి ఓ వెరైటీ మటన్‌ వంటకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే.. దమ్‌ కా మటన్‌. అన్ని రకాల మసాలాలు.. పదార్థాలతో దమ్‌ కా మటన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

prepare dum ka Mutton in this way food simple recipe
Mutton

దమ్‌ కా మటన్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

మటన్‌ – అర కేజీ, వేయించిన ఉల్లిపాయలు – కప్పు, జీడిపప్పు – 50 గ్రా., బాదంపప్పు – 50 గ్రా., కొబ్బరిపొడి – 3 టీస్పూన్లు, ధనియాల పొడి – 2 టీస్పూన్లు, గరం మసాలా పొడి – 1 టీస్పూన్‌, జీలకర్ర పొడి – 1 టీస్పూన్‌, పసుపు – పావు టీస్పూన్‌, కారం – 2 టీస్పూన్లు, పెరుగు – 1 కప్పు, కొత్తిమీర, పుదీనా – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీస్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – 2 టీస్పూన్లు, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు.

దమ్‌ కా మటన్‌ను తయారు చేసే విధానం..

మటన్‌ను కడిగి నీళ్లు వడబోసుకోవాలి. జీడిపప్పు, బాదం, ధనియాల పొడి, గరంమసాలా, కొబ్బరి, జీలకర్ర పొడులు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోయకూడదు. వీటిని గిన్నెలోకి తీసుకుని నెయ్యి, నూనె వేసి కలపాలి. దీన్ని మూత పెట్టి ఆరు గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత మందపాటి గిన్నె లేదా పాన్‌లో ఈ మటన్‌ మిశ్రమం వేసి పైన అంచులకు తడిపిన గోధుమ పిండి ముద్ద చుట్టలా చేసి అంటించి మూత పెట్టాలి. పైన బరువు పెట్టి పది నిమిషాలు మధ్యస్థంగా ఉండే మంట మీద, ఆ తరువాత 40 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికిస్తే.. కూర సిద్ధమైపోతుంది. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది. నిదానంగా ఉడకడం వల్ల ముక్క చాలా రుచిగా.. మెత్తగా ఉంటుంది.

Share
Admin

Recent Posts