Itel Mobile : మొబైల్స్ తయారీదారు ఐటెల్.. కొత్తగా ఐటెల్ ఎ27 పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా చాలా తక్కువగా ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్ లభిస్తోంది. రెండు సిమ్ కార్డులను వేసి ఉపయోగించుకోవచ్చు.
ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. దీనికి ఫేస్ అన్ లాక్ సపోర్ట్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్ ఉంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 32 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉండగా.. ముందు వైపు 2 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.
ఈ ఫోన్‌లో మెమొరీని పెంచుకునే ఆప్షన్‌ను అందిస్తున్నారు. మెమొరీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.
ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్ ధర రూ.5,999 గా ఉంది. దీన్ని అన్ని ఆఫ్ లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.