Jackfruit Idli : ఇడ్లీలు.. మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా మనం తరుచూ చేసే ఇడ్లీలను ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమయ్యి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కనుక తరుచూ చేసే ఇడ్లీలకు బదులుగా పనస ఇడ్లీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పనస తొనలతో చేసే ఈ ఇడ్లీలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ పనస ఇడ్లీ మిక్స్ మనకు సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో సులభంగా లభ్యమవుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనస ఇడ్లీ మిక్స్ తో ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పనస ఇడ్లీ మిక్స్ – 2 కప్పులు, నీళ్లు – తగినన్ని.
పనస ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పనస ఇడ్లీ మిక్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. తరువాత ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్ లల్లో వేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లను బయటకు తీసి కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత ఇడ్లీలను ప్లేట్ లో వేసుకుని నచ్చిన చట్నీతో, సాంబార్ తో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనస ఇడ్లీలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తరుచూ ఒకేరకం ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా పనస ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.