Protein Rich Fruits : ఈ 5 పండ్ల‌ను రోజూ తింటే చాలు.. చికెన్ మ‌ట‌న్‌తో ప‌నిలేదు..!

Protein Rich Fruits : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. ప్రోటీన్ మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీర పెరుగుద‌ల‌కు, కండ పుష్టికి, క‌ణాల నిర్మాణంలో అలాగే పాడైన క‌ణాల‌ను తిరిగి సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డంలో ప్రోటీన్ ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుద‌ల‌కు, ఎముకుల‌, గోర్లు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉండ‌డంలో, అవ‌య‌వాల ప‌రిపూర్ణ ఆరోగ్యానికి , హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా మ‌న శ‌రీరంలో ఉన్న అయ‌వాల‌న్నింటికి కూడా ప్రోటీన్ ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. మ‌నం తీసుకునే ఆహారంలో రోజూ 15 నుండి 33 శాతం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. కానీ నేటి త‌రుణంలో మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

క‌నుక శ‌రీరంలో ప్రోటీన్ లోపించ‌కుండా చూసుకోవాలి. ప్రోటీన్ ల‌భించే ఆహారాలు అన‌గానే చాలా మంది చికెన్, మ‌ట‌న్, కోడిగుడ్లు అని అనుకుంటారు. అయితే వీటిని అంద‌రూ కొనుగోలు చేసి తిన‌లేరు. కేవ‌లం మాంసంలోనే కాకుండా మాంసం కంటే చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్ల‌ల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ శ‌రీరంలో ప్రోటీన్ లోపం త‌లెత్త‌కుండా చూసుకోవ‌చ్చు. పండ్లు అంద‌రికి అందుబాటు ధ‌ర‌లో ఉంటాయి. వీటిని అంద‌రూ చాలా సుల‌భంగా తీసుకోవ‌చ్చు. ప్రోటీన్ ఎక్కువ‌గా పండ్ల గురించి అలాగే వాటిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ ఉండే పండ్ల‌ల్లో జామ‌పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌లో విరివిగా ల‌భిస్తాయి. అలాగే చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు.

Protein Rich Fruits in telugu take them daily for many benefits
Protein Rich Fruits

ఒక కప్పు జామ‌పండు ముక్క‌ల‌ల్లో 4.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జామ‌పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే స‌హ‌జ సిద్దంగా తియ్య‌గా, మ‌ధుమ‌రైన రుచిని క‌లిగి ఉండే ప‌న‌స పండ్ల‌ల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ప‌న‌స తొన‌ల‌ల్లో అనేక ర‌కాల పోష‌కాల‌తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒక క‌ప్పు ప‌స‌న తొన‌ల‌ల్లో 2.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప‌న‌స పండ్లు ల‌భించిన‌ప్పుడు వీటిని ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ల్ల ప్రోటీన్స్ తో పాటు ఇతర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అదే విధంగా మ‌న‌కు అతి త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అర‌టి పండ్ల‌ల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. మ‌ధ్య‌స్థంగా ఉండే ఒక అర‌టిపండులో 1.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అర‌టిపండ్లు చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. క‌నుక వీటిని అంద‌రూ తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

అలాగే ఆప్రికాట్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఒక ఆప్రికాట్ లో 2.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆప్రికాట్ ను స‌లాడ్ రూపంలో తీసుకున్నా లేదా ఎండిన ఆప్రికాట్ ను తీసుకున్నా కూడా మ‌న శ‌రీరానికి ప్రోటీన్ అందుతుంది. ఇక గ్రేప్ ఫ్రూట్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఒక గ్రేప్ ఫ్రూట్ లో 1.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చూడ‌డానికి నారింజ పండులా ఉంటుంది. కానీ నారింజ పండు కాదు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ తో పాటు విట‌మిన్ సి కూడా శ‌రీరానికి అందుతుంది. ఈ విధంగా ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావల్సినంత ప్రోటీన్ ల‌భిస్తుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. మాంసానికి బ‌దులుగా ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ లోపం త‌గ్గ‌డంతో పాటు రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts