jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

మంచి జాబ్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఇలా అప్లై చేసుకుని ఉద్యోగాన్ని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని బ్యాంక్ చెప్పింది. బిజినెస్ కరస్పాండెంట్ కోఆర్డినేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పింది.

నవంబర్ 6వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉన్న ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వయసు 65 ఏళ్లు దాటకుండా ఉండాలి. 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటే అవకాశాన్ని పొందడానికి అవుతుంది.

jobs in bank of baroda how to apply

అలాగే శాలరీ విషయానికి వస్తే రూ.15000 వరకు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్లను పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి. ఈ కింది అడ్రెస్ కి పంపండి.

బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, జబల్‌పూర్ ప్రాంతం, ప్లాట్ నెం. 1170, 1వ అంతస్తు, శివముల టవర్, ఆస్తా మెడికల్ దగ్గర, రైట్ టౌన్, జబల్పూర్ –  482002, మధ్య ప్రదేశ్.

Peddinti Sravya

Recent Posts