Kadai Mushroom Masala : పుట్ట గొడుగుల‌ను ఇలా చేసి తింటే.. ఆ రుచిని అస్స‌లు విడిచిపెట్ట‌రు..!

Kadai Mushroom Masala : మ‌న‌లో చాలా మంది పుట్ట గొడుగుల‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వ‌ర్షాకాలం సీజ‌న్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పొలం గ‌ట్ల ప‌క్క‌న పుట్ట గొడుగులు అధికంగా ల‌భిస్తాయి. అయితే ప్ర‌స్తుతం వీటిని చాలా మంది పెంచుతున్నారు. క‌నుక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ప్ర‌తి సీజ‌న్‌లోనూ పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా అనే కూర‌ను త‌యారు చేసుకుని చ‌పాతీల్లో తింటే ఎంతో అద్బుతంగా ఉంటుంది. పైగా మ‌న‌కు పుట్ట‌గొడుగుల వ‌ల్ల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇక ఈ కూర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Kadai Mushroom Masala you will not leave this dish if you cook like this
Kadai Mushroom Masala

క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుట్ట గొడుగులు – 200 గ్రా., క్యాప్సిక‌మ్ ముక్క‌లు – ఒక క‌ప్పు, టమాటా ముక్క‌లు – రెండున్న‌ర క‌ప్పులు, ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూన్‌, గ‌రం మ‌సాలా పొడి – ఒక టీస్పూన్‌, క‌సూరి మేథీ – ఒక టీస్పూన్‌, మీగ‌డ – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్‌, ఎండు మిర్చి – 4, నూనె – 2 టేబుల్ స్పూన్లు.

క‌డై మ‌ష్రూమ్ మ‌సాలాను త‌యారు చేసే విధానం..

బాణ‌లిలో ధ‌నియాలు, ఎండు మిర్చి వేసి వేయించి తీసి చ‌ల్లారాక పొడి చేయాలి. నాన్ స్టిక్ పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేగాక ధ‌నియాలు, ఎండు మిర్చి పొడి వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు స‌న్న‌గా త‌రిగిన ట‌మాటా ముక్క‌లు, ఉప్పు వేసి ఉడికించాలి. అవి మెత్త‌గా ఉడికిన త‌రువాత క్యాప్సిక‌మ్ ముక్క‌లు, పుట్ట గొడుగుల ముక్క‌లు వేసి ఉడికించాలి. పుట్ట‌గొడుగుల్లోని నీళ్ల‌న్నీ ఆవిరైపోయి అవి బాగా ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరీ మేథి వేసి బాగా క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర తురుము, మీగ‌డ వేసి దించాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా రెడీ అవుతుంది. దీన్ని చ‌పాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Admin

Recent Posts