Fridge Water : ఫ్రిజ్‌ల‌లో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని బాగా తాగుతున్నారా ? అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

Fridge Water : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగుతుంటారు. వేస‌విలో సాధార‌ణ నీరు వేడిగా ఉంటుంది. క‌నుక అలాంటి నీళ్లను తాగితే దాహం తీర‌దు. కాబ‌ట్టి స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌ట్టి కుండ‌ల్లో నీళ్ల‌ను తాగే వారు త‌క్కువ‌య్యారు. ఫ్రిజ్‌లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటున్నాయి. క‌నుక ఫ్రిజ్‌ల‌లో నీళ్ల‌ను పెట్టుకుని అవి చ‌ల్ల‌గా అయ్యాక తాగుతున్నారు. అయితే వాస్త‌వానికి ఫ్రిజ్‌ల‌లో నీళ్లు మ‌న‌కు హాని క‌ల‌గ‌జేస్తాయి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక దుష్ప్రభావాలు క‌లుగుతాయి. అవేమిటంటే..

are you drinking Fridge Water first know these things
Fridge Water

ఫ్రిజ్‌ల‌లో ఉంచిన నీళ్లు మ‌రీ చ‌ల్ల‌గా అవుతాయి. అలాంటి నీళ్లను తాగ‌డం అంత మంచిది కాదు. అతి వేడిగా ఉండే నీళ్ల‌ను మ‌నం తాగ‌లేం క‌దా. అలాగే అతి చ‌ల్ల‌గా ఉండే నీళ్ల‌ను కూడా తాగ‌రాదు. తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డుతుంది. క‌ఫం బాగా త‌యార‌వుతుంది. అది చిక్క‌ప‌డి గ‌ట్టిగా అవుతుంది. శ‌రీరంలో నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రాదు. దీంతో శ్వాస కోశ స‌మ‌స్య‌లు వస్తాయి. క‌నుక ఫ్రిజ్‌ల‌లో ఉంచిన నీళ్ల‌ను తాగ‌రాదు. మ‌ట్టి కుండ‌ల్లో అయితే మ‌రీ అతిగా చ‌ల్ల‌గా నీళ్లు మార‌వు. మ‌నం తాగే మోతాదులోనే నీళ్లు చ‌ల్ల‌గా అవుతాయి. అలాంటి నీళ్లను తాగినా మ‌న‌కు ఏమీ కాదు. క‌నుక మ‌ట్టి కుండ‌లోని చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు.

ఇక చాలా మంది మిన‌ర‌ల్ వాట‌ర్‌నే తాగుతున్నారు. కానీ అందులో సూక్ష్మ క్రిములు ఉంటే.. ఒక వేళ ఆ నీటిని మ‌రిగించ‌కుండా అలాగే ఫ్రిజ్‌లో పెడితే ఆ సూక్ష్మ క్రిములు అలాగే ఉండే అవ‌కాశాలు ఉంటాయి. అలాంటి చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌డం ఇంకా హానిక‌రం. అదే మ‌ట్టి కుండ‌లో ఆ నీళ్ల‌ను పోస్తే.. మ‌ట్టిలో ఉండే మిన‌ర‌ల్స్ కార‌ణంగా ఆ నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చ‌నిపోతాయి. అలాంటి నీటిని తాగినా మ‌న‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌దు. క‌నుక మ‌ట్టి కుండ‌లో ఉంచిన నీళ్ల‌ను తాగ‌డం మ‌న‌కు మంచిద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక మ‌ట్టి కుండ‌లో నీళ్లు స‌హ‌జ‌సిద్ధంగా చ‌ల్ల‌గా అవుతాయి. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌ల‌గ‌దు. కానీ ఫ్రిజ్‌లో అయితే నీళ్లు కృత్రిమ ప‌ద్ధ‌తిలో చ‌ల్ల‌గా మారుతాయి. అలా అవి చ‌ల్ల‌గా అయ్యేట‌ప్పుడు గాలిలోకి హానికర వాయువులు విడుద‌ల‌వుతాయి. అవి ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేస్తాయి. క‌నుక మట్టికుండ‌లో అయితే స‌హ‌జసిద్ధంగా చ‌ల్ల‌గా అయ్యే నీళ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. కాబ‌ట్టి అన్ని విధాలుగా ఎటు చూసినా కూడా.. మ‌ట్టి కుండ‌ల్లోని నీళ్ల‌ను తాగ‌డ‌మే మ‌న‌కు శ్రేయ‌స్క‌రం అని చెప్ప‌వ‌చ్చు. ఈ నీళ్ల‌ను తాగితే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. క‌నుక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

Admin

Recent Posts