Karachi Halwa : స్వీట్ షాపుల్లో ల‌భించే క‌రాచీ హ‌ల్వా.. ఇలా చేస్తే రుచిగా వ‌స్తుంది..!

Karachi Halwa : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే వాటిల్లో క‌రాచీ హ‌ల్వా కూడా ఒక‌టి. ఈ హ‌ల్వా వివిధ రంగుల్లో చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సాగుతూ, బంక‌గా ఉండే ఈ హ‌ల్వాను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ హ‌ల్వాను మనం ఇంట్లో తయారు చేసుకోలేమ‌ని భావిస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు దీనిని త‌యారు చేసిన‌ప్ప‌టికి హ‌ల్వా మెత్త‌గా, ముద్ద‌లాగా వ‌స్తుంది. కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల హ‌ల్వా రుచిగా ఉండ‌డంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ హ‌ల్వాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ క‌రాచీ హ‌ల్వాను స్వీట్ షాప్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌రాచీ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కార్న్ ఫ్లోర్ – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పులు, పంచ‌దార – 3 క‌ప్పులు, నెయ్యి – పావు క‌ప్పు, నిమ్మ‌ర‌సం – 1 లేదా 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా.

Karachi Halwa recipe in telugu very tasty sweet
Karachi Halwa

క‌రాచీ హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న త‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో పంచ‌దార‌, మ‌రో క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి అందులో నుండి ముప్పావు వంతు పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ముందుగా త‌యారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని వేసి అంతా క‌లిసేలా ఉండలు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత మంట‌పై చిన్న‌గా చేసి ఇందులో ప‌క్క‌కు తీసిన పంచ‌దార పాకం నుండి పావు క‌ప్పు పంచ‌దార పాకాన్ని వేసి క‌ల‌పాలి. కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మం పంచ‌దార పాకాన్ని పీల్చుకున్న త‌రువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌ల‌పాలి. నెయ్యి కూడా మిశ్ర‌మంలో క‌లిసి పోయిన త‌రువాత మ‌రో పావు క‌ప్పు పంచ‌దార పాకాన్ని వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మ‌ర‌లా నెయ్యి వేసి క‌ల‌పాలి.

త‌రువాత మిగిలిన పంచ‌దార పాకాన్ని వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా నెయ్యి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. దీనిని బంక‌గా సాగే గుణం వచ్చే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. నెయ్యి పైకి తేలి మ‌న‌కు కావ‌ల్సినంత సాగే గుణం వ‌చ్చిన త‌రువాత డ్రై ఫ్రూట్స్, యాల‌కుల పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌న‌కు న‌చ్చిన ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ హ‌ల్వాను ట్రై లో వేసుకుని పైన మ‌రిన్ని డ్రై ఫ్రూట్స్ ను చ‌ల్లుకుని స‌మానంగా చేసుకోవాలి. దీనిని పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని న‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా క‌రాచీ హ‌ల్వాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts