Kidneys : మూత్ర‌పిండాల‌ను శుభ్రం చేసే చిట్కా.. ఏం చేయాలంటే..?

Kidneys : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటానే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. మూత్ర‌పిండాల ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తినే వాటిలో మ‌లినాలు పేరుకుపోయిన మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇది మ‌ర‌ణానికి కూడా దారి తీస్తుంది. మూత్ర‌పిండాలు దెబ్బ‌తింటే ఆ ప్ర‌భావం ముందుగా మ‌న చ‌ర్మం, జుట్టు మీద ప‌డుతుంది. త‌రువాత శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల మీద ప‌డుతుంది. అలాగే మూత్ర‌పిండాల ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోతే యూరీన‌రి ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ ల‌తో పాటు పురుషుల్లో లైంగిక బ‌ల‌హీన‌త కూడా తలెత్తే అవ‌కాశం ఉంది. బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ను, జంక్ ఫుడ్ ను, ప్యాకేజ్ట్ ఫుడ్ తీసుకునే వారిలో మూత్ర‌పిండాల ఆరోగ్యం త్వ‌ర‌గా దెబ్బ‌తింటుంది. అలాగే మ‌సాలా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, చ‌క్కెర ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి అలవాట్లు ఉన్న వారిలో కూడా మూత్ర‌పిండాలు త్వ‌ర‌గా పాడ‌వుతాయి.

అలాగే ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకునే వారు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడే వారిలో కూడా మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఎటువంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డకుండా ఉండాలంటే మూత్ర‌పిండాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవ‌డం అవ‌స‌రం. మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాల‌ను తొల‌గించి వాటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే రెండు ర‌కాల చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాల‌ను వారినికి ఒక‌సారి వాడితే చాలు మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో మ‌న‌కు పుచ్చ‌గింజ‌ల టీ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ టీ ని మ‌నం తాజా పుచ్చ‌గింజ‌ల‌తో లేదా మార్కెట్ లో దొరికే ఎండిన పుచ్చ గింజ‌ల‌తో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనికోసం ముందుగా 2 టీ స్పూన్ల పుచ్చ‌గింజ‌ల‌ను తీసుకుని పొడిగా చేసుకోవాలి.

Kidneys cleaning home remedy how to use it
Kidneys

త‌రువాత ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక అందులో పుచ్చ‌గింజ‌ల పొడిని వేసి 5 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని ఒక బాటిల్ నిల్వ చేసుకుని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాలన్ని తొల‌గిపోతాయి. ఈ టీని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ఇక మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌రిచే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో మొక్క‌జొన్న పొత్తులో ఉండే పీచు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం సాధార‌ణంగా ఈ పీచును ప‌డేస్తూ ఉంటాం. కానీ ఈ మొక్క‌జొన్న పీచుతో టీ ని తయారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ పీచుతో టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్ర‌ప‌డ‌తాయి.

మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి కూడా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, రక్తపోటు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక గుప్పెడు మొక్క‌జొన్న పీచును వేసి నీళ్లు రంగు మారే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక బాటిల్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్ర‌ప‌డ‌తాయి. వాటి ఆరోగ్యం మెరుగుప‌డి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. అంతేకాకుండా మ‌న శ‌రీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

D

Recent Posts