Karivepaku Tomato Pachadi : ట‌మాటా క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Karivepaku Tomato Pachadi : మనం ట‌మాటాలతో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ‌లల్లో క‌రివేపాకు ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌రివేపాకు, ట‌మాటాల‌తో క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాల‌తో తిన‌డానికైనా ఈ ప‌చ్చ‌డి చాలా చ‌క్క‌గా ఉంటుంది. 10 నుండి 15 నిమిషాల్లో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క‌రివేపాకు ట‌మాట‌ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – అర కప్పు, ప‌చ్చిమిర్చి – 10, క‌రివేపాకు – 3 చిన్న క‌ట్ట‌లు, కొత్తిమీర – ఒక చిన్న క‌ట్ట‌, ట‌మాటాలు – 300 గ్రా., ఉప్పు – త‌గినంత‌.

Karivepaku Tomato Pachadi recipe in telugu make in this method
Karivepaku Tomato Pachadi

ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత నువ్వులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చికొబ్బ‌రి తురుము వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వేయించిన ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు , ఎండుమిర్చివేసి వేయించి ప‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. వేడి వేడి అన్నంతో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts