ఆధ్యాత్మికం

Karthaveeryarjuna Mantram : ఇంటి నుంచి పోయిన వ్య‌క్తులు లేదా పోయిన వ‌స్తువుల‌ను ఇలా పొంద‌వ‌చ్చు.. ఈ మంత్రాన్ని జ‌పించాలి..

Karthaveeryarjuna Mantram : ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆనందం ఉండాలని, అంతా మంచే జరగాలని అనుకుంటారు. ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా లేదంటే భార్యా భర్తల మధ్య సమస్యలు రావడం, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా చేయండి. ఇలా ఈ ఒక్క మంత్రాన్ని మీరు స్మరిస్తూ ఉంటే, తిరిగి మీరు కోల్పోయిన వాటిని పొందవచ్చు.

స్నానం చేసిన తర్వాత శుచిగా మీరు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, మీరు కోల్పోయిన వాటిని తిరిగి పొందొచ్చు. డబ్బుని కానీ మనశ్శాంతిని కానీ లేదంటే మీ ఇంటి నుండి ఎవరైనా వెళ్ళిపోయినా కానీ తిరిగి మీరు పొందొచ్చు. దృఢ సంకల్పంతో ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది.

Karthaveeryarjuna Mantram you can get lost items

కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్, తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే.. ఈ మంత్రాన్ని, మన మనసులో కోరికని చెప్పుకుని రోజూ పూజ చేస్తే కోల్పోయిన వాటిని మళ్లీ మనం పొందొచ్చు. కార్తవీర్యార్జునుడు ఎవరంటే విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. చేతిలో ఇది ఉండడం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలిగాడు. సుదర్శన చక్రం వల్లే సంహరించాలని స్వామి గ్రహించి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.

కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టాడు. కానీ దత్తాత్రేయుడుని ప్రార్థించి, వెయ్యి చేతుల కలవాడిగా మారతాడు. అందుకే ఇతన్ని సహస్ర బాహు అని పిలుస్తారు. అలానే శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా ఈయన పొందుతాడు. బలపరాక్రముడు కార్తవీరుడు. అయితే ఇంట్లో ఏమైనా పోయినా లేదంటే మీరు తిరిగి దేనినైనా పొందాలన్నా, పైన చెప్పినట్లు పాటించి మళ్లీ వాటిని పొందండి.

Admin

Recent Posts