చిట్కాలు

గొంతు నొప్పి, ద‌గ్గును త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

ఈ సీజ‌న్‌లో చాలా మంది గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలనో లేక కాలుష్యం వలనో ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటివి తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ప్రయత్నం చేయాలి. గొంతు నొప్పి, దగ్గు తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

నల్ల యాలుక‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన అవి గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పని చేస్తాయి. ఈ సీజ‌న్‌లో గొంతు నొప్పి, దగ్గు తగ్గడానికి నల్ల యాలుకలు బాగా సహాయం చేస్తాయి. లవంగాలను, రాళ్ల ఉప్పుతో కలిపి నమిలి తింటే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఇలా లవంగం, రాళ్ల ఉప్పు కలిపి తీసుకోవడం వలన అది వాపు నుంచి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

remedies to get rid of throat pain

ఈ సీజ‌న్‌లో మనం తక్కువగా నీరు తగినప్పటికీ గోరు వెచ్చ‌ని నీటిని తాగడం చాలా మేల‌ని చెప్తున్నారు నిపుణులు. అది గొంతును ఇన్ఫెక్షన్ ను నుంచి తగ్గిస్తుంది. తేనె, అల్లం కలిపి తీసుకోవడం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా దగ్గు కూడా త్వరగా తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవడం వలన గొంతు నొప్పి, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Admin

Recent Posts