ఆధ్యాత్మికం

Lakshmi Devi : పూజ గదిలో వీటిని పెట్టండి.. ఆర్థిక సమస్యలు ఏమీ వుండవు.. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి, మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే, పూజగదిలో ఈ వస్తువులని పెట్టండి. ఈ వస్తువులను కనుక మీరు పూజ గదిలో పెట్టినట్లయితే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి పూజ గదిలో ఎటువంటి వస్తువులను పెట్టాలి..?, లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ గదిలో ఈ వస్తువులను కనుక మీరు పెట్టినట్లయితే ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేయాలి. అయితే పూజ సమయంలో మనం గంటని మ్రోగిస్తాము. పూజ గదిలో గంటని పెట్టినట్లయితే దుష్టశక్తులు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు ఉండవు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పూజ గదిలో నెమలి ఈకని పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది.

keep these in pooja room for wealth

ఆర్థికంగా కూడా దృఢంగా ఉండచ్చు. ఆర్థిక బాధలు ఏమీ కూడా ఉండవు. కాబట్టి నెమలి ఈకని కూడా పూజ గదిలో పెట్టుకోండి. దీపం లేకపోతే పూజ అసంపూర్ణం. పూజ గదిలో దీపాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. పూజ గదిలో దీపాన్ని పెట్టినప్పుడు పడమర వైపు పెట్టండి. అలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.

పూజ గదిలో శంఖాన్ని పెడితే కూడా సిరిసంపదలు కలుగుతాయి. పూజ గదిలో నీళ్లు నింపిన కలశాన్ని పెడితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు. గంగాజలాన్ని పూజ గదిలో పెడితే కూడా చాలా మంచి కలుగుతుంది. పూజగదిలో ఇత్తడి లేదంటే వెండి పాత్రలో గంగాజలం పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఇలా వీటిని పూజ గదిలో పెట్టినట్లయితే ఆర్థిక బాధలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

Admin

Recent Posts