ఆధ్యాత్మికం

Lord Hanuman : ఆంజ‌నేయ స్వామికి ఇష్ట‌మైన‌వి ఇవే.. ఇలా చేస్తే మీకు తిరుగే ఉండదు..!

Lord Hanuman : మంగళవారం నాడు వీటిని పాటిస్తే మంచిది. మంగళవారం నాడు హనుమంతుడికి నమస్కారం చేసుకుంటే, ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. మంగళవారం హనుమంతటిని పూజిస్తే కష్టాల నుండి బయటపడొచ్చు. ఆంజనేయస్వామిని మంగళవారం ఆరాధిస్తే ఎలాంటి బాధలున్నా సరే బయటపడొచ్చు. మంగళవారం నాడు హనుమంతుడి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని పెట్టుకుంటే కూడా మంచిది. మంగళవారం రామనామం జపిస్తే హనుమంతుడు ప్రీతిపాత్రుడై నిరంతరం వారికి తోడుగా ఉంటాడు.

మంగళవారం రాముడికి కేవలం ఒక్క నమస్కారం పెడితే చాలు. హనుమంతుడు ఆ కుటుంబానికి రక్షణగా ఉంటాడు. మంగళవారం నాడు హనుమంతుడిని, దుర్గాదేవిని ఆరాధిస్తే జాతక దోషాలు, గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలాంటి బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించొచ్చు.

Lord Hanuman likes these do like this

మంగళవారం నాడు దుర్గాదేవికి ఇష్టమైన పాయసం, పులిహోర, గారెలు నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. కోరికలు కూడా నెరవేరుతాయి. మంగళవారం నాడు శుభాలు కలిగి కోరికలు నెరవేరాలంటే, క‌చ్చితంగా ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా పాటించండి. హనుమంతుడి ఆలయంలో మంగళవారం నాడు అరటి గెల సమర్పిస్తే అనుకున్న కోరికలు పూర్తవుతాయి.

మంగళవారం పూజ గదిలో హనుమంతుడికి అరటి పండ్లు, పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే, సంపదకి ఎలాంటి లోటు ఉండదు. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణం చేస్తే, హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. అలానే ప్రమాదాల నుండి రక్షణని కూడా పొందుతారు. ఇలా ఇక్కడ చెప్పినట్లుగా మీరు మంగళవారం నాడు పాటించినట్లయితే కచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఎలాంటి కష్టాలు కూడా ఉండవు, ఆనందంగా ఉండొచ్చు. కష్టాల నుండి గట్టెక్కి సుఖసంతోషాలని పొందొచ్చు. కాబట్టి కచ్చితంగా మంగళవారం నాడు వీటిని గుర్తుపెట్టుకుని ఆచరించండి. ఇక మీకు తిరిగే ఉండదు.

Admin

Recent Posts