Kobbari Karjuram Bobbatlu : కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్లు.. ఎంతో రుచికరం.. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి..!

Kobbari Karjuram Bobbatlu : కొబ్బరిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మనకు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అని రెండు రకాలుగా కొబ్బరి లభిస్తుంది. అయితే పచ్చి కొబ్బరిని అందరూ తినలేరు. ఎండుకొబ్బరినే చాలా మంది తింటారు. దీంతో అనేక రకాల స్వీట్లను తయారు చేసుకోవచ్చు. వాటిల్లో బొబ్బట్లు కూడా ఒకటి. ఇది సంప్రదాయమైన తీపి వంటకం. దీన్ని చాలా మంది తయారు చేస్తుంటారు. అయితే బొబ్బట్లను కొబ్బరి, ఖర్జూరాలతో తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ఈ బొబ్బట్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..

మైదా పిండి, కొబ్బరి తురుము, బెల్లం తురుము, నీళ్లు – అన్నీ ఒక్కొ కప్పు చొప్పున, ఖర్జూరాల పేస్ట్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్‌, నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్స్‌.

Kobbari Karjuram Bobbatlu very tasty and delicious
Kobbari Karjuram Bobbatlu

కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్లను తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మైదా పిండి, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పూరీ పిండిలా కలపాలి. అందులో కాస్త నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్‌ మీద నీళ్లు, బెల్లం తురుము వేసి కరిగించాలి. ఆ బెల్లం మిశ్రమంలో కొబ్బరి తురుము, ఖర్జూరాల పేస్ట్‌, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. దగ్గరపడే వరకు ఉడికించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తరువాత.. కలిపి పక్కన పెట్టుకున్న మైదాపిండి ముద్దను కొంచెం తీసుకుని ఉండలా చుట్టి చేత్తోనే పూరీల్లా ఒత్తి మధ్యలో కొబ్బరి మిశ్రమం పెట్టాలి. చుట్టూ మూసి మళ్లీ గుండ్రంగా ఒత్తుకోవాలి. పెనం మీద నెయ్యి వేసి బొబ్బట్టుని దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. దీంతో రుచికరమైన కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్లు తయారవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. వీటి ద్వారా పోషకాలను, శక్తిని పొందవచ్చు.

Share
Editor

Recent Posts