sports

విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ విడాకులు తీసుకుంటున్నారా..?

ఈమ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీ జంట‌లు చాలా మంది విడిపోతున్నారు. దీంతో రోజుకో కొత్త జంట‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. అవ‌న్నీ నిజం కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్ విడిపోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మొద‌టిసారి వీరు ఆ వార్త‌ల‌ను ఖండించారు. కానీ త‌రువాత అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక వీరి విడాకుల వార్త‌లు బ‌లంగా ప్రచారం అవ‌డానికి కార‌ణం.. వీరు ఏ వేడుక‌కు హాజ‌రు అయినా విడివిడిగా వ‌స్తున్నారు. అందుక‌నే వీరు విడిపోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ జంట‌పై కూడా విడాకుల వార్త‌లు గుప్పుమంటున్నాయి. వీరిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌రినొక‌రు హేళ‌న చేసుకున్న‌ట్లుగా స్టోరీస్ పెట్టారు. దీంతో ఆ స్టోరీస్ ను ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ వీరు విడిపోతున్నార‌ని, అందుకనే ఇలా పోస్టులు పెడుతున్నార‌ని అంటున్నారు. అయితే వాస్త‌వానికి విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ చ‌క్క‌ని జంట‌గా ఉన్నారు. కానీ వీరిపై ఇలాంటి వార్త‌లు వ‌స్తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. సెల‌బ్రిటీల విడాకులు మామూలే కానీ చ‌క్క‌ని క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న వారు కూడా విడిపోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురిచేస్తోంది.

kohli and anushka sharma are they getting divorce

అయితే ఈ వార్త‌ల‌ను అటు విరాట్ కోహ్లి కానీ, అనుష్క శ‌ర్మ కానీ ఖండించ‌లేదు. దీంతో అవి నిజ‌మే అని అంటున్నారు. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నారా, లేదా.. అనే విష‌యం తెలియాలంటే కొంత‌కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇక అనుష్క శ‌ర్మ తాజాగా షారూక్ ప‌క్క‌న జీరో అనే సినిమాలో న‌టిస్తుండ‌గా, మ‌రోవైపు విరాట్ త్వ‌ర‌లో న్యూజిలాండ్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌లో ఆడ‌నున్నాడు.

Admin

Recent Posts