వినోదం

Krishna : ఒకే కథాంశంతో తెరకెక్కిన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సినిమాలేవో తెలుసా..? రెండూ హిట్ అయ్యాయి..!

Krishna : తెలుగు సినీ పరిశ్రమలో ఒకే పేరుతో వచ్చే ఎన్నో చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మిస్సమ్మ, దేవదాసు ఇలాంటి ఎన్నో చిత్రాలు మరోసారి అదే పేరుతో వచ్చిన చిత్రాలు కూడా చూశాం. మరి కొన్ని సినిమాలు పేర్లు వేరుగా వచ్చిన కథ మాత్రం ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. పూర్తి స్థాయిలో అదేవిధంగా కథ లేకపోయినా కొంచెం పోలిక‌ అయితే మాత్రం కనిపిస్తుంది. అలా దగ్గరగా ఒకే కథతో వచ్చిన తండ్రి కొడుకుల సినిమా ఇది ఒక్కటే అని చెప్పచ్చు. ఆ చిత్రాలు ఇంకా ఎవరివో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్స్ కృష్ణ మరియు మహేష్ బాబులవి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం. ఈ చిత్రంలో ఊరి కోసం హీరో తన కోట్ల రూపాయల ఆస్తిని, తను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి దేవరకోట అనే ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిలోఎంపీ మరియు అతని తమ్ముడు చేసే ఆకృత్యాలను ఎదురుకొని చివరకు ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు అనే కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు కొరటాల శివ. చివరకు శృతిహాసన్ ని పెళ్లి చేసుకుని అదే ఊర్లో ఉండిపోతాడు. ఈ చిత్ర కథాంశం కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించింది.

krishna and mahesh babu done same movies with story

1983లో దాదాపుగా ఈ స్టోరీ కి దగ్గరలో కోదండరామిరెడ్డి దర్శకత్వం సూపర్ స్టార్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమారాజు అనే స్టోరీ కూడా ఇంచుమించు శ్రీమంతుడు చిత్రం మాదిరిగా ఉంటుంది అని చెప్పచ్చు. ఈ చిత్రంలో కృష్ణకి జంటగా శ్రీదేవి నటించారు. లంకా నగరం అనే గ్రామంలో రామరాజు అనే పెద్దమనిషి కార్మికులను పీడిస్తూ ఊరి పెద్దగా చలామణి అవుతూ ఉంటాడు.

అదే సమయంలో ఊరిలోకి వచ్చిన భీమారాజు హీరోయిన్ ను ప్రేమించడం జరుగుతుంది. విలన్ చేసే చెడు పనులకు భీమ‌రాజు అడ్డుపడుతూ ఉంటాడు. అయితే చివరలో భీమరాజు కోటీశ్వరుడని, కోట్ల ఆస్తిని వదులుకొని ఇక్కడకు వచ్చాడని భీమరాజు తండ్రి చెప్పడం జరుగుతుంది. చివరకు హీరో విలన్ కు సరైనా గుణపాఠం చెప్పి హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు దాదాపు ఒకే విధంగా ఉండే ఈ రెండు కథలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి.

Admin

Recent Posts