mythology

అప్సరసలు ఎంతమంది.. వారి పేర్లు ఏమిటో తెలుసా?

ప్రస్తుత కాలంలో అందం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయిల అందాలను దేవలోకంలో సౌందర్య తారలను వర్ణించి భావిస్తారు. స్వర్గలోకంలో దేవతల నాట్య మండలిలో నాట్యమాడుతూ అలరించేందుకు నియమించబడిన వారే ఈ అప్సరసలు. పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఉండేవారని తెలుస్తోంది.

అప్సరసలు తమ సౌందర్యంతో ఎంతోమంది దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. అదేవిధంగా మరెంతో మంది మునులు తపస్సు భగ్నం కారణంగా శాపానికి గురైన వారు ఉన్నారు. ఎన్నో యుగాలు మారిన తమ అందం మాత్రం తగ్గని వారే ఈ అప్సరసలు. అప్సరసలు అంటే అందరికీ గుర్తొచ్చేది రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమలే మనకు గుర్తొస్తారు. నిజానికి అప్సరసలు 31 మంది.వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. వారి పేర్లు ఇపుడు తెలుసుకుందాం.

how many apsarasa are there and their names

రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, ఘృతాచి, సహజన్య మ్లోచ, వామన, మండోదరి, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన, ప్రమ్లోద, మనోహరి, మనో మోహిని, రామ, చిత్రమధ్య, శుభానన,సుకేశి, నీలకుంతల, మన్మదోద్ధపిని, అలంబుష, మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ వంటి 31 మందిని అప్సరసలుగా పిలిచేవారు.

Admin

Recent Posts