Kumbha Rashi : ధనం మూలం ఇదం జగత్ అని అంటారు పెద్దలు. ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతుందని దాని అర్థం. ధనం చుట్టూ ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ధనం లేనిదే ఏ పని కూడా జరగదు. ప్రతి ఒక్కరూ ధనవంతుడు అవ్వాలని, ధనం బాగా సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. మన రాశిని బట్టి కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో త్వరగా ధనవంతులు కావొచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుంభరాశి వారు కొన్ని ప్రత్యేకమైన సూచనలను పాటించడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం కలిగి త్వరగా ధనవంతులు అవ్వవచ్చు.
కుంభరాశిలో పుట్టిన వారు తూర్పు లేదా ఉత్తర సింహద్వారాలు ఉన్న ఇంట్లో నివాసం ఉండాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. వీరు ఎటువంటి పరిస్థితులల్లో కూడా దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల వారికి ఆదాయం తగ్గుతుంది. అదే విధంగా కుంభరాశి వారు ఇంట్లో ఆగ్నేయం మూలలో మాత్రమే పూల మొక్కలను పెంచాలి. ఇలా పెంచడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం ఆ పూల మొక్కల ద్వారా కలుగుతుంది. ఈ రాశి వారు ఇంటి ఆవరణలో మందార మొక్కను పెంచుతూ ఆ మొక్క మొదట్లో ప్రతి రోజూ నీళ్లు పోయడం వల్ల కచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదే విధంగా కుంభ రాశి వారు ఎప్పుడైనా హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక రావి చెట్టును నాటి దానికి నీరు పోయడం వల్ల జాతక దోషాలు అన్నీ పోయి త్వరలోనే ధనవంతులు అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా కుంభ రాశి వారు ఎట్టి పరిస్థితులల్లో కూడా చెట్లను నరక కూడదు. ఎన్ని చెట్లను పెంచి పోషిస్తే వారికి అంత మంచి జరుగుతుంది. రావి, మర్రి వంటి దేవతా వృక్షాలను పెంచితే ఇంకా మంచిది. వీటిని పెంచడం కుదరకపోతే ఆలయాలలో ఉన్న చెట్లకు నీటిని పోయడం వల్ల కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ కుంభరాశి వారు ప్రతి రోజూ ఓం సహా గురవై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి త్వరగా ధనవంతులు అవుతారు. వీరు ఇంట్లో కుబేర యంత్రాన్ని ప్రతిష్టించుకోవడం వల్ల అపరకుబేరులు అవుతారు. ఈ నియమాలను పాటించడం వల్ల కుంభరాశి వారు త్వరగా ధవంతులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.