Cow : హిందూ పురాణాలలో ఆవుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆవును చాలా ప్రవితంగా భావిస్తారు. హిందూ పురాణాలు గోవులో సకల దేవతలు ఉంటారని తెలియజేస్తున్నాయి.చాలా మంది గోవులను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. కొన్నిసార్లు గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. ఇలా నిలబడప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు. కొందరు వాటిని తరిమేస్తూ ఉంటారు. ఇలా తరిమివేయడం చాలా తప్పు. అసలు గో మాత ఎందుకు అలా వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోవు పాదాలలో మన పితృదేవతలు, అడుగుల్లో ఆకాశ గంగ, స్థనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతం, కడుపు కైలాసం ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కో దేవత నిక్షిప్తమై ఉంటారు. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు సకల దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చెబుతూ ఉంటారు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ, విష్ణువులు నివసిస్తారు. అగ్ర భాగాన తీర్థములు, శిరస్సు మధ్య భాగాన శివుడు, దిగువ అంగాళాలలో చతుష్ట గుణాలు ఇమిడి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఎందరో మహానుభావాలు గో సంరక్షణ ఆవశ్యకతను మనకు గట్టిగా చెప్పడం జరుగుతోంది. శ్రీ కృష్ణ పరమాత్ముడు గోవులను లాలించి, ఆరాధించి గోపాలుడు అయ్యాడు. గోవులు స్వర్గ సోపానాలు అని కూడా అంటూ ఉంటారు.
గోవు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి. గోవును పూజిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి. గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సకల దేవతల ఆశీస్సులు సొంతం కానున్నాయని, ఆ రోజూ శుభవార్తను వింటారని అర్థం. అలా ఆవు ఇంటి ముందు వచ్చి నిలబడినప్పుడు ముందుగా పూజించాలి. తరువాత ఆవుకు శనగలు, బెల్లం, పశుగ్రాసం వంటి వాటిని ఆవు తృప్తి పడే వరకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల సకల దేవతలు తృప్తి పడతారు. ఆవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం కలుగుతుంది.
ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసిన దానితో సమానం. గోమాత ఇంటి ముందు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే పైన చెప్పిన విధంగా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. గోవులను సేవించడం వల్ల ఏ ఆటంకం వల్ల ఆగిపోయిన పని అయినా కూడా పూర్తవుతుంది. గోవుకు ఆకుకూరలు, పండ్లను తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోమాత ఇంటి ముందు వచ్చి నిలబడితే ఇంట్లోని వారికి ఏదో శుభం కలుగుతుంది అని అర్థం. కనుక గోవు వచ్చి నిలబడగానే పైన చెప్పిన విధంగా చేయడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయి.