Left Over Rice Idli : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇడ్లీల‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Left Over Rice Idli : మ‌నం రోజూ ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఇడ్లీలు ఒక‌టి. వీటిని భిన్న‌ర‌కాలుగా త‌యారు చేసుకుని తింటుంటారు. ఇడ్లీల‌ను కొంద‌రు సాంబార్‌తో తింటే కొంద‌రు చ‌ట్నీతో, ఇంకొంద‌రు కారంపొడితో తింటారు. ఎలా తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇడ్లీల‌ను త‌యారు చేయాలంటే అప్ప‌టిక‌ప్పుడు అయ్యే ప‌నికాదు. దానికి ముందు రోజే ప‌ప్పును నాన‌బెట్టి పిండి ప‌ట్టాలి. కానీ మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్ ఇడ్లీని త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఇక ఈ ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – ఒక క‌ప్పు, ఇడ్లీ ర‌వ్వ – రెండు క‌ప్పులు, పెరుగు – ఒక క‌ప్పు, నీళ్లు – త‌గిన‌న్ని, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Left Over Rice Idli you can make them in very quick time
Left Over Rice Idli

ఇడ్లీల‌ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ ర‌వ్వ‌ను వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో అన్నాన్ని, పెరుగును, కొద్దిగా నీటిని పోసి మొత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు నాన‌బెట్టుకున్న ఇడ్లీ రవ్వ‌ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మిక్సీ ప‌ట్టిన అన్నం మిశ్ర‌మాన్ని, ఉప్పును, వంట‌సోడాను వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌లో త‌గిన‌న్ని నీళ్లు పోసి, పిండిని ప్లేట్ ల‌లో వేసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి 5 నిమిషాల త‌రువాత మూత తీయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెత్త‌గా మృదువుగా ఉండే ఇడ్లీలు త‌యార‌వుతాయి. అన్నం మిగిలిన‌ప్పుడు లేదా ఇడ్లీ పిండిని త‌యారు చేసుకునేంత స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా అన్నం ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని కొబ్బ‌రి కారం, వెల్లుల్లి కారం, ప‌ల్లి చ‌ట్నీ, సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటి కోసం ఎక్కువ స‌మ‌యాన్ని వృథా చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చాలా త్వ‌ర‌గా వీటిని త‌యారు చేయ‌వ‌చ్చు.

Share
D

Recent Posts