Left Over Rice Vada : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడేలా వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Left Over Rice Vada : మ‌నం అల్పాహారంగా అప్పుడ‌ప్పుడూ వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాధార‌ణంగా మ‌నం మిన‌ప‌ప్పుతో వ‌డ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు నాన‌బెట్టి పిండి రుబ్బే ప‌నిలేకుండా కూడా మ‌నం వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ప్పు రుబ్బే ప‌ని లేకుండా మిగిలిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు మ‌నం ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మిగిలిన అన్నంతో ఇన్ స్టాంట్ గా వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ వ‌డ‌ల తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 2 క‌ప్పులు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి ర‌వ్వ – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, ప‌చ్చిమిర్చి త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Left Over Rice Vada recipe in telugu how to make them
Left Over Rice Vada

క్రిస్పీ వ‌డ‌ల తయారీ విధానం..

ముందుగా ఒక జార్ లో అన్నం, పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేతికి త‌డి చేసుకుంటూ త‌గినంత పిండిని తీసుకుని వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వ‌డ‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వ‌డ‌లు త‌యార‌వుతాయి.

వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అన్నం మిగిలిన‌ప్పుడు, ప‌ప్పు నాన‌బెట్టి పిండి రుబ్బ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా లేన‌ప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. త‌ర‌చూ చేసే మిన‌ప‌ప్పు వ‌డ‌ల కంటే ఇలా అన్నంతో చేసిన వ‌డ‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. వీటిని ఎన్ని తిన్నామో అని తెలియ‌కుండానే ఇంట్లో అంద‌రూ తినేస్తారు.

D

Recent Posts