ఆధ్యాత్మికం

Lemon For Dishti : షాపుల్లో గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మ‌కాయ‌ల‌ను ఎందుకు వేస్తారో తెలుసా..?

Lemon For Dishti : దృష్టి దోషాల వలన చాలా మంది సతమతమవుతుంటారు. దృష్టి దోషాలు కలిగి, అనేక బాధలు ఎదుర్కొంటున్నట్లయితే, కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే, ఈ చిట్కాలను తప్పక పాటించండి. నిమ్మకాయలని దృష్టి దోషాలని తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. పాజిటివ్ ఎనర్జీని కలిగించేసి, నెగటివ్ ఎనర్జీ తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. పైగా వీటిలో అతీత శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతారు.

ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు, మనం వ్యాపారస్తులు ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయని పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే, ఇలా షాపుల్లో వాటిని పెట్టడం వలన కొన్ని ప్రత్యేకమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. దుష్ట శక్తుల నుండి నిమ్మకాయలు రక్షిస్తాయని యజమానుల నమ్మకం. అలానే, కొంతమంది షాపుల్లో నిమ్మకాయలని, మిరపకాయలని కట్టి వేలాడదీస్తూ ఉంటారు. మంత్ర తంత్రాలలో నిమ్మకాయలకి ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది అని అంటారు.

lemon for dishti removal how it works

అయితే, దృష్టి దోషాలు తొలగిపోవాలన్నా, సమస్యలు ఏమి లేకుండా డబ్బులు రావాలన్న, ప్రశాంతంగా జీవించాలన్న ఇలా ఆచరించండి. గురువారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి, నాలుగు నిమ్మకాయలని, లవంగాలని తీసుకువెళ్లి పూజ చేయండి. ఇక మీకు ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ఆనందంగా ఉండొచ్చు. వ్యాపారం సరిగ్గా జరగకపోతున్నట్లయితే, నిమ్మకాయలను తీసుకుని షాపులోని నాలుగు గోడలకి ఆ నిమ్మకాయలని ముట్టించి, ఆ తర్వాత నిమ్మకాయల్ని నాలుగు ముక్కల కింద చేసి నాలుగు దిక్కులలో ఆ ముక్కల్ని పెట్టండి. ఇలా చేయడం వలన శని అంతా బయటకు వెళ్ళిపోతుంది.

అలానే, ఇంటి ఆవరణలో ఒక నిమ్మకాయ చెట్టుని పెంచడం వలన దుష్ట‌ శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. వాస్తు దోషాల నుండి కూడా బయటపడొచ్చు. దృష్టి దోషంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఒక నిమ్మకాయని తీసుకుని కింద నుండి పై వరకు దిష్టి తీసేసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ ప్రదేశంలో ప‌డేయాలి. ఆ తర్వాత అక్కడ నుండి తిరిగి చూడకుండా వచ్చేయాలి. దిష్టి మొత్తం పోతుంది. హాల్లో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్లు పోసి, అందులో ఒక నిమ్మకాయని పెడితే దృష్టి దోషాలు ఉండ‌వు. ఇలా సులభంగా నిమ్మకాయaతో దృష్టి దోషాలు తొలగిపోతాయి. ధనం కలుగుతుంది. బాధల నుండి విముక్తి పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts