హెల్త్ టిప్స్

Meals : భోజ‌నం చేసిన వెంట‌నే ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు..!

Meals : ప్రతిరోజు టైం టు టైం భోజనం చేయడం చాలా ముఖ్యం. చాలా మంది భోజనాన్ని, అల్పాహారాన్ని ఆలస్యంగా తింటుంటారు. ఏవేవో పనులు ఉన్నాయని ఆలస్యంగా తింటుంటారు. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేశారంటే కచ్చితంగా మీరే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. భోజనం చేసిన తర్వాత టీ తాగడం అసలు మంచిది కాదు. భోజనం చేశాక టీ తాగితే యాసిడ్ రిలీజ్ అయిపోతుంది.

తిన్న ఆహారం జీర్ణం అవడం కష్టంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ కాలిస్తే అది పది సిగరెట్లతో సమానమ‌ట‌. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత బెల్ట్ ని లూజ్ గా పెట్టకూడదు. అలా చేయడం వలన ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని సరిగ్గా అరగకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. భోజనం తిన్న తర్వాత పండ్లను తింటే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది.

doing these mistakes after meals is unhealthy doing these mistakes after meals is unhealthy

పండ్లు తినాలనుకుంటే భోజనానికి గంట ముందు కానీ గంట‌ తర్వాత కానీ తినాలి. అదే విధంగా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేస్తే కాళ్లకు, చేతులకు రక్త సరఫరా ఎక్కువ అయ్యి, జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కాబట్టి ఈ పొరపాటును కూడా చేయకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కూడా మంచిది కాదు.

తిన్న వెంటనే నిద్రపోవడం వలన తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. గ్యాస్టిక్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి. కాబట్టి తిన్న వెంటనే నిద్రపోకండి. ఒకవేళ కనుక నిద్రని మీరు ఆపుకోలేకపోతున్నట్లయితే ఒక పది నిమిషాల పాటు నిద్రపోయి తర్వాత మళ్ళీ నిద్ర లేవండి. చూశారు కదా భోజనం చేశాక ఎలాంటి తప్పులు చేయకూడదనేది. సో మరి ఇక ఫాలో అయిపోండి.

Admin

Recent Posts